boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

మే, 2007 సంచిక

గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్
అధ్యక్షుడు, జాతీయ మానవహక్కుల కమీషన్
భారత రాష్ట్రపతి
భారత ప్రధానమంత్రి

బూటకపు ఎన్ కౌంటర్ చావులను వెంటనే ఆపండి !
ఎన్-కౌంటర్ మరణాలపైన సుప్రీంకోర్టు తో విచారణ చేసి, దోషులను శిక్షించండి!
మానవహక్కులను కాపాడి న్యాయస్థానాలపైన నమ్మకాన్నినిలబెట్టండి!
పూర్తిగా చదవండి »

ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, స్వయంకృషి, సృజనాత్మకత వీటన్నిటికీ కలిపి ఒక రూపం వస్తే ఆ మనిషి వాసిరెడ్డి సీతాదేవి. ఎంత పట్టుదల, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేకపోతే ఒక చిన్న గ్రామంలో, రోడ్డు దాటి బడికి వెళ్ళడం ఆడపిల్లలకు నిషేధమైన నిర్బంధ సంప్రదాయాల లోంచి మద్రాసు మహా నగరం చేరుతుంది ఒక అమ్మాయి! ఇల్లు విడిచి మహా నగరంచేరి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తృప్తిపడి ఊరుకోలేదా అమ్మాయి.
పూర్తిగా చదవండి »

mayday_4.jpg

“భౌ భౌ వ్ .. “ అరుస్తోంది గ్రే హౌండ్ .
అంటే యజమాని రాత్రి భోజనం ముగించి మేడమెట్లెక్కుతున్నడన్న మాట.
జాతి కుక్కలకి గ్రహింపు ఎంతో జ్ఞాపకం అంత. కాలుస్తున్న బీడీ ఆర్పేసి మెట్లపక్కకి విసిరేస్తూ లేచాడు వాచ్ మన్.శునకజాతికి విశ్వాసం మహాజాస్తీ. చేరదీసేవాళ్ళ చనువు కోసం వాటిలో వాటికి చచ్చినంత పోటీ. ఉన్నవి మూడు గొలుసులు. ఆ మూడూ విడదీసేసరికి మూడు యుగాలౌతుంది.
http://prajakala.org/PDF/KaaRaa_Shanthi.pdf

పూర్తి కథ పి.డి.ఎఫ్ లో చదవండి. కా.రా మాస్టారు రాసిన యీ కథను ఇంటర్నెటు నుండి సేకరించటం జరిగింది.

- జ్వలిత

సగటుది సామాన్యమయినది నా మనసు
నా బలం బలహీనత కూడా నా మనసే
వర్జీనియాటెక్ అయినా విజయవాడయినా
శ్రీలక్ష్మీ, లక్ష్మీసుజాత ఎవరయినా
ప్రేమ-హింస రూపమెత్తింది అహాలను తృప్తిపరచలేదనేగా!

పూర్తిగా చదవండి »

- యెనికపాటి కరుణాకర్

ప్రేమగా ఇంటికి రమ్మని పిలిచిన
మిత్రుడ్ని అడుగుతాను
మీ ఇంటికి ఎన్ని మెట్లుంటాయని
మెట్లంటే మీకు కేవలం
పేర్చిన ఇటుకల వరుసే కావచ్చు

పూర్తిగా చదవండి »

mayday_5.jpg
ఉక్కు కార్మికులు: చిత్రకారుడు - ఇవాన్ బెవ్ జంకో.

ప్రతిజ్ఞ

పొలాల నన్నీ, హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ –
జగానికంతా సౌఖ్యం నిండగ –
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !

పూర్తిగా చదవండి »

- కొండేపూడి నిర్మల

నిజానికి ముందు నుంచీ అమ్మీకి తెలుసు, దీదీకి తెలుసు
అఖండ పాతివ్రత్యం లాంటి ఈ దేశభక్తి
వితంతు దుఖాన్ని తప్ప నీ బేటీకేమిచ్చింది అబ్బాజాన్
చైనా యుద్ధంలో, పాకిస్తాను పోరులో, కాశ్మీరు రణబలిలో
పూర్తిగా చదవండి »

- ఖాజా

రింగా రింగా రోజెస్‌ల
వినూత్న ప్రపంచావిష్కరణ జరిగిపోయాక
జేబుల్నిండా రంగు కాగితాల రంగవల్లులు నిండిపోయాక
ఇళ్ళలో కొత్తగా హైబిడ్ తులసిమొక్కలు అంటు కట్టుకున్నాక
తెగిపడిన తాతల నాలుక సాక్షిగా
కార్పొరేట్ కాలేజీలో
పిల్లలకు సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజిగా పెట్టి గర్విస్తున్నాక
పూర్తిగా చదవండి »

- మంఛికంటి

భర్తలు లేని కాలాన్ని
స్వేఛా స్వాతంత్ర్యాలకు
హద్దుల్లేని ఆకాశంగా ప్రకటించండి
తిని తాగి పైనబడి కొట్టి రక్కి
హింసలోనే సుఖాలు వెతుకు‎నే పురుష పుంగవులకి
ఏ రోజూ మీ చూపులు సోకకుండా తెల్లవారదు

పూర్తిగా చదవండి »

- నబి కె. ఖాన్

ఆవేశం నిండిన
నా ఆలోచనలోకో
ఆలోచన నిండిన
నా అంతరంగంలోకో
ఒకానొక
ఉల్క రాలుతున్నప్పుడు
నేను చూసిన అనుభవం నుంచి
ఒకానొక
వాల్కనో పేలుతున్నప్పుడు

పూర్తిగా చదవండి »

- కుంబం అశోక్

ప్రపంచీకరణంటే
సాంకేతిక విప్లవంతో ఉత్తర, ధక్షిణ ధృవాలను కలిపేసి
ప్రపంచాన్ని సమతలం చేసి
భూమికి ఆకాశానికి రోదసి వంతెన వేసి
దూరాన్ని, కాలాన్ని ఖతం చేసి
ప్రపంచం ఒక కుగ్రామమని మాటల గారడీ చేస్తూ

పూర్తిగా చదవండి »

- దేవరకొండ విన్సెంట్

అమెరికా లో కార్మిక సంఘాలు ( United States Federation of organized trade and labor unions) ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం మే 1, 1886 లో సమ్మె మొదలు పెట్టేరు. మే 3 తారీఖున మెఖార్మిక్ రీపర్ వర్క్స్ (Mccormik Reaper Works ) ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు నిరాయుధులుగా ఉన్న కార్మికులపై నిర్ధాక్షిణ్యం జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు.
పూర్తిగా చదవండి »

- ధూళిపాళ అన్నపూర్ణ

నేను తాళం తీసుకొని లోపలికి వెళ్ళి గ్లాసు చల్లటి మంచినీళ్ళు తాగి సోఫాలో చతికిలపడ్డాను. ఇంతలో రివ్వుమంటూ నా పదేళ్ళ కొడుకు నందూ పరిగెత్తుకొచ్చాడు.
“అమ్మా! డాడీ రెండు నెలల్లో కారు కొనేస్తారుట. ప్రపంచంలోని అన్ని దేశాలకు మధ్యనున్న గేట్లు తెరిచేశారుట. కార్లు ‘చర్’మంటూ మనదేశంలోకి దూసుకు వచ్చేస్తున్నాయటే! చాలా చీప్‌గా కొనుక్కోవచ్చని పొద్దుట అంకుల్‌తో చెప్తున్నాడు నాన్న. అమ్మా! అమ్మా! మనం కార్లో ముందు సాయిబాబా గుడికి వెళ్దామమ్మా! ప్లీజ్! తోవలో శ్రీధర్ వాళ్ళకి మన కారు చూపించొచ్చే!'’ అంటూ కారు గుమ్మంలో ఉన్నట్టే బతిమాలేస్తున్నాడు వెధవ!

పూర్తిగా చదవండి »

- వట్టికోట ఆళ్వార్‌స్వామి

(గత సంచిక తరువాయి)

‘పాపం మీనాయనగారు పెద్దమనిషి. ఆయన గతించినప్పటి నుండి అన్నీ చిక్కులేనని విన్నాను'’ రామభూపాల్‌రావు మాట్లాడటానికి పిలిపించిన వెంకటాచారితో పరామర్శగా అన్నాడు.
రామభూపాల్‌రావు ఆవిధంగా శాంతంగా, చనువుగా మాట్లాడటం వెంకటాచారికి ఆశ్చర్యం వేసింది. రామభూపాల్‌రావు ఎల్లప్పుడు అధికార ధ్వనిలో మాట్లాడటం అతనికి తెలిసన సంగతి. రామభూపాల్‌రావు అంటే వెంకటాచారికి భయం కూడాను.
పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రకరకాల ఉద్వేగాలూ, ఆవేశాలూ (ఇమోషన్స్‌) మనుషులలో ఉన్నంతగా మరే ప్రాణికీ ఉండవు. జీవపరిణామంలో తక్కిన ప్రత్యేక లక్షణాలతో బాటుగా ఇది కూడా మనుషులకు అలవడిన ఒక గుణం. ఏదో ఒక దశలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనిషి మనుగడకు ఇది అవసరమై ఉండాలి. వీటిలో శరీరలక్షణాలుగా ఏర్పడినవి కొన్ని అయితే మరికొన్ని పరిసరాలవల్ల మన ప్రవర్తనలో కలిగిన మార్పులు.
పూర్తిగా చదవండి »