- వరవరరావు

నేనీసారి జైల్లో ఉన్న కాలంలోనే, ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటురంగంలో కూడ విద్యా ఉపాధి అవకాశాలు జనాభా ప్రాతిపదికపై ఒబిసిలకు ఎస్‌సి ఎస్‌టిలకు కల్పించే విధంగా అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రజాస్వామిక ఉద్యమం ఊపందుకుంది. ముస్లింలకు రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణల ప్రజాస్వామిక అవసరాన్ని కూడ ఇంచుమించు అన్ని రాజకీయపార్టీలే కాదు, ప్రభుత్వాలూ ఆమోదించక తప్పని స్థితి ఏర్పడింది.

ఇది అగ్రవర్ణాలకు, కార్పొరేట్ సంస్థలకు, వాళ్ల గుప్పిటలో ఉన్న మీడియాకు మింగుడుపడడం లేదు. ఒబిసి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన స్వభావం సారాంశమిది. యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో, యాంటీ రిజర్వేషన్ ఫోరం హైదరాబాద్ చాప్టర్ పేరుతో ఇపుడీ అగ్రవర్ణ వికృత అహంకార సంస్కృతి తెలుగునేల మీదికి కూడ మళ్లీ ప్రవేశిస్తున్నది.

1986లో మొదటిసారి ఎన్‌టిర్ ప్రభుత్వం ఒబిసిలకు విద్యారంగంలో ఉన్న 25శాతం రిజర్వేషన్లను 40శాతానికి పెంచింది. చిత్తశుద్దితో కాదు, ప్రజాకర్షక చర్యగా. అయినా హైకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసేదాకా అగ్రవర్ణ విద్యార్థులు, ముఖ్యంగా వైద్యవిద్యార్థుల నాయకత్వంలోనే ఆ పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు. అచ్చంగా ఇపుడు ఢిల్లీ, పాట్నా వంటి నగరాల్లో ఎయిమ్స్, ఐఐటి వంటి సంస్థల అగ్రవర్ణ విద్యార్థులు చేస్తున్నట్లే. కనుక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఇది మూడో మండల్ వ్యతిరేక ఆందోళన అవుతుంది - ఐక్యంగా ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోకపోతే.

విచిత్రమైన సన్నివేశమేమిటంటే ఈ ఇరవై ఏళ్లలోనే ఎన్‌టిఆర్‌తోనే ప్రారంభమై విద్యా, వైద్యరంగాలు ఆంధ్రప్రదేశ్‌లో వేలంవెర్రిగా ప్రైవేటీకరింపబడినాయి.

కులముగలుగు వారు
గోత్రంబు గలవారు
విద్యచేత విర్రవీగువారు
పసిడిగలుగు వాని బానిస కొడుకులు

అని వేమన చెప్పినట్లు కొనితెచ్చుకున్న ‘ప్రతిభ’ బండారాన్ని మనం బట్టబయలు చేయాల్సి ఉంది. ఆ ఆకాంక్షతోనే ఇరవై ఏళ్ల క్రితం, అపుడుకూడ జైల్లోనే రాసిన డాఝూవు (ఇపుడున్న పరిస్థితి ఇదివరకే అనుభవించామన్న, ఎద్దుకు కాడి వంటి, చిరపరిచితమైన విసుగైన విషయం)
(కవితను శీర్షికతో సహా చిన్న చిన్న మార్పులతో మళ్లీ ఈ సంకలనంలో చేరుస్తున్నాను.)

ఒక్క అభిప్రాయం

  1. ప్రసాద్ 02 ఏప్రిల్ 2007 , 1:01 pm

    బాగా చెప్పారండీ. ప్రతిభ ప్రతిభ అంటూ ప్రతిజ్ఞ చేస్తారే గానీ ప్రతిభ డబ్బుతో వస్తోంది అంటే వినరే. ఇన్ని ప్రైవేట్ కాలేజీలు ఇంతలేసి డొనేషన్లు కట్టించుకొని (ప్రతిభ చూస్తోందా డబ్బు చూస్తోందా) డబ్బున్న మారాజులకు చదువును ముంగిట చేరుస్తోంటే ప్రతిభ వుండీ డబ్బులేక కుమిలిపోయే వాడి గురించి ఎవ్వరూ అడగరేం!
    కుల బలం, ధన బలం వున్నవాడితో పోటీపడాలంటే “రిజర్వేషన”నే ఈ బలమైనా లేకుంటే అభాగ్యులు బతికేదెట్టా!

    –ప్రసాద్
    http://blog.charasala.com

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)