- పి. వెంకటరత్నం
సూర్యోదయానికి
బయపడిన చలి
గదుల్లో దాక్కునేందుకు
ఇంటి చూరుల్లోంచి
కిటికీ సందుల్లోంచి
జాగా వెదుకుతూ
జాగర్త పడుతోంది
ధైర్యం చాలని
చలిమంట
పొగతో ముఖం
కప్పుకుందిచలిమంట వద్ద
మనుష్యుల వెనక్కి వెళ్ళి
దాక్కుంది చలి
చలిమంట
చాటుగా నవ్వుకుంది
ముందు వేడి
వెనుక చలి
వణుకు ఇంకా
ఎక్కువై
చ్ఛా! ఎందుకొచ్చాను
కంబళిని విడిచి
అనుకుంటూ
మనిషి.
మళ్ళీ మూడంకె
వేసేందుకు
గది మూలకే
వెళ్ళాడు
అప్పటికే
తిష్టవేసిన చలిని
చూచి కంబళి
దిగులుగా నిమ్మకుంది
వేడి లేక
గది మిన్నకుంది
మనిషి దేహం
మెలికలు తిరిగి
అమ్మ ఒడిని
తలుచుకుంది
అమ్మ ఆలోచన రాగానే
చలి ఏమైందో
మనసులో
వేడి పుట్టడం
ఆరంభమైంది
చలికి వెన్నుల్లోంచి
చలి పుట్టడం
ఆరంభమై
గది ఉండలేక
గల్లంతైంది.
అనవసరంగా సాగదీసిన వాక్యాలను తీసేస్తే మంచి కవిత కాగలదు.