- కొండేపూడి నిర్మల
మీట నొక్కారు
ఇల్లు కూలిపోయింది
మధ్య గదిలో పెద్ద అగాధం
అన్నాలు తింటున్న వాళ్ళు తింటున్నట్టే
బొమ్మలై పోయారు
చేతిలో వున్న ముద్ద నోటికి అందడం లేదు
నోటిలో ముద్ద గొంతు దిగడం లేదు
ఒకప్పుడు
ఇదే భోజనాల గది బంధువుల కబుర్లతో
కొసరి కొసరి వడ్డిం చే రుచులతో ఘుమ ఘుమ లాడేది
పిల్లల చదువులు,పెళ్ళిళ్ళు,ఇంటి సమస్యలు,వీధి తమాషాలు
అన్నిటి మీదా చర్చలు జరిగేవి
అప్పుడప్పుడు పిల్లలు అలిగితే పెద్దలు బుజ్జగించేవారు
పెద్ద లు కోపిస్తే పిల్లలు నవ్వించే వారు
భోజనం ప్రశాంతం గా,సంతోషం గా
ప్రేమకు ప్రతిరూపంగా వుండాలని అందరూ నమ్మేవారు
వంట పట్టిన ఉప్పూ కారమూ రుచులతో మనుషులు ప్రవర్తించేవారు
ఇప్పుడు కూర గిన్నెలో హత్య
సాంబారు గిన్నెలో జుగుప్స
పచ్చడి గిన్నెలో భీభత్సం
మనుషులు అన్నం తినడం లేదు
బావుంది :)
చాలా బాగుంది. మీట నొక్కగానే ఇల్లు కులిపొవడమనేది చాలా చక్కని వ్యక్తీకరణ. ఈ పెట్టె చేస్తున్న అస్లు పని అదే. సొంత జీవితాలని కూడా ఎక్కడొ పారేసుకుని వెతుక్కొనాల్సిన పరిస్తితి లొ ఉన్నము.