“ఒక మానవుని మరో మానవుడు దోచుకోవడానికి వీలులేని న్యాయ సమ్మతమైన ఆర్ధిక వ్యవస్థను స్థాపించడంకోసం మేం క్రాంతిని ఆహ్వానిస్తున్నాం.

- భగత్ సింగ్

…………………………………………………………………………………………….

“గాంధీజీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. రహస్యం ముందు ప్రకటించటం వారికి ఇష్టం లేదో, లేకపోతే ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎలా ఓడించాలో వారికీ తెలియదేమో”

- నేతాజీ సుభాశ్చంద్రబోస్

……………………………………………………………………………………………

“మానవుల్లో భయమూ ఆత్మరక్షణకు ప్రయత్నించడమూ సహజ ప్రవృత్తులు. ఈ సహజ ప్రవృత్తులకు వ్యతిరేకమైంది ఆత్మహత్య. విప్లవాన్ని ఆత్మరక్షణతో పోల్చుకుంటే, సత్యాగ్రాహాన్ని అత్మహత్యకు పోల్చవచ్చును. ఆత్మహత్యా సదృశమైన అసహజమార్గంలో నడవగలవారు ఒకరో ఇద్దరో ఉండవచ్చును. వాళ్ళయినా వెనుకనుండి ప్రజల సానుభూతి తమకు అండగా వుందన్న వున్నప్పుడే ఆ మార్గాన నడువగలరు”

- యశపాల్

……………………………………………………………………………………………

“విప్లవకారులమైన మేము విప్లవం ద్వారానే ఈ దేశ ప్రజలకు దాస్య విముక్తి కలుగుతుందని అనుకుంటున్నాము. విప్లవం అంటే మా ఉద్దేశ్యంలో పర ప్రభుత్వంతో పోరాడటం మాత్రమేకాదు. మా విప్లవానికి ఆదర్శం న్యాయ సమ్మతమైన ఒక క్రొత్త సమాజాన్ని స్థాపించడం. పెట్టుబడిదారీ విధానాన్ని నాశనంచేసి, వర్గ రహితమైన సమాజ వికాసానికి దోహదం చేయడం. విదేశీయుల దోపిడి నుండి, దేశీయుల దోపిడి నుండి ప్రజలను కాపాడి, వారికి స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వడం మా విప్లవానికి ఆదర్శం –“

- చంద్రశేఖర్ ఆజాద్

……………………………………………………………………………………………

“స్వాతంత్ర్యం దానం మాదిరి ఒకరి నుండి స్వీకరింపబడదు. అలా స్వీకరించినా అది నిలవదు. స్వాతంత్ర్యం కోసం మన హృదయ రక్తంమర్పించి దానిని పొందాలి”

- గాంధీ

……………………………………………………………………………………………

దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైననూ ఒక మేల్ చేసి జనులకు చూపవోయ్

- గురజాడ అప్పారావు

……………………………………………………………………………………………

“విప్లవాన్ని వ్యతిరేకించేవారు కేవలం పిస్తోళ్ళు, బాంబులు, కత్తులు, రక్తపాతమే విప్లవం అనుకుంటున్నారు. ఇవి విప్లవానికి సహకరించేవి మాత్రమే. కేవలం ఆయుధాలే విప్లవం కాదు. వీటివెనుక సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చుకోవాలన్న బలమైన కోర్కె ఉంటుంది. అదే నిజమైన విప్లవశక్తి” అదీ విప్లవ నిర్వచనం.

- భగత్ సింగ్

……………………………………………………………………………………………

“ నా జీవితంలో దేవుడిని ఎన్నడూ తలచుకోలేదు. దేవుడనేవాడుంటే. నాదేశస్తులు అనుభవిస్తున్న కష్టనష్టాలను చూస్తూ వూరుకుంటున్నందుకు కొన్నిసార్లు ఆ దేవుణ్ని నిందించానుకూడా. ఈ చివరిక్షణంలో మృత్యువుకు యెదుట నిలచి దైవాన్ని ప్రార్ధిస్తే అతడు నన్ను పిరికిపంద ఆత్మవంచకుడు అనుకుంటాడు. నన్ను ఇప్పుడున్న విధంగానే ఈ లోకంనుంచి వెళ్ళనివ్వండి. ఏ ఒక్కరుకూడా భగత్ సింగ్ చావునుచూసి భయపడిన పిరికిపంద అని నిందించకూడదు.”

- భగత్ సింగ్

……………………………………………………………………………………………

అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు? కాంచవోయి ఈ దుస్థితి – ఎది రించవోయి ఈ పరిస్థితి !
- శ్రీ శ్రీ

మలయశ్రీ రాసిన “బొమ్మల భగత్ సింగ్” పుస్తకం నుండి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)