‘అభివృద్ధి మాయాజాలం - రాజకీయార్థిక పరిచయం’ అంశంపై రెండవ సెషన్, చంద్రశేఖర్ అధ్యక్షోపన్యాసం:

రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసే అభివృద్ధిలో 20 లక్షల మంది నిర్వాసితులవుతున్నారు. గిరిజనులే కాదు రైతులు కూడా అధిక సంఖ్యలో నిర్వాసితులవుతున్నారు. మరోప్రక్క ప్రత్యేక ఆర్థిక మండళ్ళు నెలకొల్పి పారిశ్రామికవేత్తలకు ఏది కావాలంటే అది ఇస్తామంటున్నారు. బెంగాల్‌లో టాటా కంపెనీ పరిశ్రమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటోంది.

1997 నుండి 2005 వరకు 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. విదేశీ మారకద్రవ్యం పెరుగుతోందంటున్నారు. విదేశీ మారకద్రవ్యం 150 మిలియన్ డాలర్లు ఉంటే 100 మిలియన్ డాలర్లు అప్పు ఉంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటున్నారు కాని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు పెరిగిపోతున్నాయి అంటున్నారు. 100 కోట్ల ప్రజలు ఉన్న దేశంలో ఎగుమతుల కోసమే ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామీణ సంక్షోభం గురించి ఎవరూ మాట్లాడరు. బిలియనీర్లు ఎక్కువ కావడమే అభివృద్ధా? చైనా అభివృద్ధి నమూనా ఏమిటి? అందరికీ సంక్షేమం లభిస్తేనే అభివృద్ధి అన్నాడు మావో. కాని ఇప్పుడు చైనాలో అసమానతలు పెరిగిపోతున్నాయి. విద్య, వైద్యం చాలా ఖరీదైనవైపోయాయి. కాబట్టి ఆర్థిక వృద్ధి మాత్రమే అభివృద్ధి కాదు.

ప్రొ॥ ఆర్.యస్. రావు ఉపన్యాసం:

అభివృద్ధి మాయాజాలం అంటున్నాం. ప్రశ్నలు లేని సమాధానాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఉంటే మాయాజాలం అంటాం. యజ్ఞం కథలో అప్పల్నాయుడు ఈ అప్పు న్యాయమా అన్యాయమా అని అడుగుతాడు. శ్రీరాములు నాయుడు చెప్పలేదు. సత్యసాయిని ఎలా ఇస్తారండీ లింగం అంటే చెప్పడు, అలా ఇస్తాడు అంతే! ఎందుకు పెడుతున్నారు ఎస్.ఇ.జడ్.లు అంటే చైనాలో ఇది పెట్టారు, అభివృద్ధి చెందవచ్చు అంటారు. అభివృద్ధి అంటే ఏమిటి? ఏమి బాగుపడుతుంది. పొలం కావాలి, భూమి ఇవ్వండి, మేము బాగుపడతామంటే భూమి లేదంటాడు. అభివృద్ధి అనేది ఏ కాలంలో వచ్చింది. వలసపాలన నుండి బయటికి వచ్చిన దేశాలు, తమ రాజ్యాలు కూడా వలస రాజ్యాలుగా ఉండాలి అనుకోవడం నుండి వచ్చింది. చైనా ఎలా చేస్తే అనిగాదు, ఏది చేస్తే అది చేస్తామంటారు. దీన్ని క్యాచింగ్ అప్ అంటారు. ఇది నెహ్రూ హయాంలోనే మొదలైంది. అంతకుముందే బాంబే ప్లాన్ ఒకటి తయారుచేశారు. ఫ్యాక్టరీలు, రైల్వేలు వంటివి వాళ్ళకున్నాయి కాబట్టి మనకు కావాలి . 50ల్లో అది బలంగా ఉండింది. కమ్యూనిస్టులు కూడా దీనికి లొంగిపోయారు.

అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు తయారుచేయమంటే ఆ అభివృద్ధిలో డ్యాములు, ఫ్యాక్టరీలు వంటివి ఉంటాయి. అది అభివృద్ధి పథకం కానీ అభివృద్ధి కాదు. కొంతవరకు స్టాలిన్ హయాంలో కూడా ఇది ఉంది. ఎంత ఇనుము, ఎంత వ్యవసాయ ఉత్పత్తి ఇలా అని ఇది ఒక భావజాలం. పెద్ద ప్రాజెక్టు ఉంటే, పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంటే అది గొప్ప రాష్ట్రం అని. ఒరిస్సాలో మహానంది పెద్ద వరదలు వచ్చే ప్రాంతం. కటక్ ఎప్పుడూ మునిగిపోతూ ఉంటుంది. ఆ వరదల్ని నివారించడానికి హీరాకుడ్ డ్యామ్ కట్టారు. అప్పుడు ఆ ముంపు ప్రాంతాలవాళ్ళు మీకు రెండు మూడేళ్ళకు వరదలు వస్తాయని 120 గ్రామాలు ముంచేస్తారా అని అడిగారు. వ్యతిరేకించినవాళ్ళలో భూస్వాములు ఉన్నారు. అభివృద్ధి వ్యతిరేకంగా ఇది ఒక ఎక్స్‌ట్రీమ్. ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌లో ప్రసన్న పండా వంటి కమ్యూనిస్టు నాయకులు నిర్వాసితుల గురించి మాట్లాడారు. ప్రత్యామ్నాయాలు చూడండి, చిన్న డ్యాములు కట్టండి, విధ్వంసం తక్కువ చేసే టెక్నాలజీ పెట్టుకోండి.

అభివృద్ధి అంటే మనకు తెలిసిన దాన్నుండి మొదలవ్వాలి. అందులో నుండి జ్ఞానం పొందాలి. ఇండియా పాలసీ ఏమంటే విజ్ఞానం ఉంది కాబట్టి అక్కడి నుండి తెచ్చుకోవాలి అని. చైనా అభివృద్ధికి, ఇండియా అభివృద్ధికి ఇదే తేడా. చైనాలో అభివృద్ధిని అభివృద్ధిగా చూశారు. ఇండియాలో అభివృద్ధిని అభివృద్ధి పథకంగా చూశారు. అభివృద్ధి అంటే సామాజిక పరివర్తనం (సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్). వ్యక్తి ఆలోచనా సరళి, ఆచరణా సరళి మారాలి. ఆలోచన, ఆచరణకు ఒక సమన్వయం ఉంటుంది. ఆ విధంగా అభివృద్ధిని చూడాలి. అభివృద్ధి ప్రణాళికలో ఏ వర్గం నష్టపోతుంది. ఆ వర్గ దృక్పథంలో మనం చూడటంలేదేమో! మన సాహిత్యంలో వర్గ విశ్లేషణ లోపిస్తున్నట్టు ఉంది. రచయితలు దాన్ని చూడాలి.

2 అభిప్రాయాలు

  1. […] 2) ‘అభివృద్ధి మాయాజాలం - రాజకీయార్థిక పరిచయం’: చంద్రశేఖర్, ప్రొ॥ ఆర్.యస్. రావు  […]

  2. SAMBA 29 ఫిబ్రవరి 2008 , 4:19 pm

    గురువు గారు బాగా వ్రాసారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)