- ప్రశాంత్

‘అభివృద్ధి - విధ్వంసం - సాహిత్య ప్రతిఫలనం’ అంశంపై విరసం 15వ రాష్ట్రసాహిత్య పాఠశాల

అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, దాని వెనక ఉన్న రాజకీయ ఆర్థిక పునాదిని విశ్లేషిస్తూ కర్నూలులో జనవరి 13, 14 తేదీల్లో విరసం రాష్ట్ర సాహిత్య పాఠశాల నిర్వహించింది. 13వ తేదీ ఉదయం పతాకావిష్కరణ అనంతరం ప్రారంభ సమావేశంలో ఆహ్వాన సంఘం తరఫున వెంకటకృష్ణగారు ఉపన్యసించారు.


కర్నూలులో రాప్తాడు గోపాలకృష్ణ సాహిత్యకృషిని గుర్తు చేసుకొంటూ విరసం చొరవతో కర్నూల్లో అనేక సాహిత్య కార్యక్రమాలతో పాటు ‘కథా సమయం’ ఏర్పాటులో కూడా విరసం కృషి ఉందని చెప్పారు. ప్రారంభ సమావేశంలో ‘తెలుగు సాహిత్యంపై విరసం ప్రభావం’ అంశంపై కా॥ చెంచయ్య మాట్లాడారు. కా॥ చలసాని ప్రసాద్ అధ్యక్షత వహించారు. అధ్యక్షోపన్యాసంలో చలసాని ప్రసాద్ కళింగాంధ్ర వెనుకబాటుతనం గురించి ప్రస్తావిస్తూ ఈ తెలంగాణ, రాయలసీమ మీద వచ్చిన సాహిత్యం కళింగాంధ్ర వెనకబాటు మీద రాలేదని, కళింగాంధ్ర గురించి అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. విరసం పుట్టుకను గురించి మాట్లాడుతూ, “ద్రౌపది అగ్నిలో పుట్టిందో లేదో తెలీదుగాని, విరసం విప్లవాగ్నుల నుండి పుట్టడం నేను కళ్ళారా చూశాను,'’ అన్న శ్రీశ్రీ మాటల్ని కోట్ చేశారు.

తెలుగు సమాజంపై విరసం ప్రభావం - చెంచయ్యగారి ఉపన్యాసం:

‘సోషలిజం స్వప్నసీమ కానేకాదు నిజం సుమా. ఆకలంత సహజమది, అన్నమంత అవసరమి,’ అన్నాడు చెరబండరాజు. ఇక్కడ సమస్య ఆకలి. పరిష్కారం అన్నం. ఇది చెప్పినంత తేలిక కాదు. సమస్యలు తీరే వరకు ఉద్యమాలు ఆగవు. విప్లవోద్యమం విజయవంతమైన తర్వాత కూడా విరసం బాధ్యత ఉంటుంది. 1970లను విరసం దశాబ్దం అని అందరూ అంగీకరిస్తారు. అంత ప్రేరణ కలిగించే శక్తి విరసానికి ఎలా వచ్చింది. విప్లవాలు అణిగిపోయే దశలో ఆ ఉద్యమమే ప్రేరణ. తెలంగాణ ఉద్యమం 1951లో ఆపేశారు. అది ఆగకూడదు అని చాలామంది అనుకొన్నారు. అదే ప్రేరణ. నక్సలైట్లంటే దోపిడీదొంగలు కాదని ప్రజల్లోకి తీసుకుపోయింది విరసం. తొలిదశలో జంఝ, లే, మార్చ్ కవితా సంకలనాలు ప్రచురించింది. కథ, నవలా ప్రక్రియలో పెద్దగా కృషి జరగలేదు. ఏ ఉద్యమమైనా మొదట కవిత్వం రూపంలో బయటపడుతుంది. ఎందుకంటే వెంటనే స్పందింపజేసేది కవిత్వం.

మాండలిక భాషలో కథ, నవల రావడానికి విప్లవ సాహిత్యోద్యమం కృషి చేసింది. చేకూరి రామారావు వంటివారే ఆ మాట అన్నారు. నిజమైన తెలుగు మాండలికాల్లోనే ఉంది. సామాజిక నేపథ్యం సాహిత్యాన్ని నిర్దేశిస్తుంది. అని బలంగా నిరూపించింది విరసం అని అన్నారు చేరా. నేపథ్యం ఒక్కటే విమర్శ కాదు అని కూడా ఆయన అన్నారు. కాని నేపథ్యం లేకుండా సాహిత్యం లేదు. ప్రబంధ కాలాల నేపథ్యం మీద త్రిపురనేని మధుసూదనరావు గొప్ప వ్యాసం రాశబుూరు. ఊహల్లో తిరిగే కవికి కూడా నేపథ్యం ఉంది. కృష్ణశాస్త్రి కూడా కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయొద్దు అన్నాడు. విశ్వనాథ గురించి మధుసూదనరావు పుస్తకమే రాశారు మార్క్సిస్టు దృక్పథంతో ఏ కాలపు సాహిత్యాన్నైనా విమర్శించి గైడ్‌లైన్‌గా ఉండాలి. టి.టి.డి. వారు మహాభారతం గురించి సభ పెడితే రెండు మూడు వేలమందితో హాలు నిండిపోయింది. ఆ ఆకర్షణ ఎందుకుందో మనం చెప్పాలి. విరసం ప్రభావం ఎంతగా ఉందంటే ఈ సమస్య వచ్చింది, విరసం ఏం మాట్లాడుతుంది అని ఎదురు చూసేవారు ఉన్నారు. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం విరసానికి ముందు అంతగా లేదు. స్పృహ అనే మాట రెండుచోట్లనే వినిపిస్తుంది. ఒకటి హాస్పిటల్, రెండు విరసం అని వెటకారంగా అనేవారు. ఆ తర్వాత నండూరి రామ్మోహన్‌రావు సామాజిక స్పృహ విరసం సొత్తు కాదు, మాక్కూడా ఉంది అని 80ల్లో అన్నారు. సామాజిక స్పృహ లేని కవి లేడు. అది విశ్వనాథకు కూడా ఉంది. కావలసింది సామాజిక చైతన్యం…

2) ‘అభివృద్ధి మాయాజాలం - రాజకీయార్థిక పరిచయం’: చంద్రశేఖర్, ప్రొ॥ ఆర్.యస్. రావు 

సాహిత్య పాఠశాల 

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)