రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం.

తొలినాటి నుండి రైతుల జీవితాల్ని స్పర్శించిన కథల్ని పంపించవలసింది గా కథకుల్ని, సాహిత్యాభిమానుల్ని అభ్యర్ధిస్తున్నాం. వివిధ పత్రికల్లొ, కథా సంపుటుల్లో ప్రచురితమైన కథల ఫొటొస్టాట్ కాపీలను కాని లేదా ఒరిజనల్స్ కాని పంపించాలి. ఈ సంపుటి కోసం ప్రత్యేకించి రాసిన కథలు అంగీకరించబడవు. గతంలో ప్రచురితమైన కథలు మాత్రమే పంపగలరు. డా.పాపినేని శివశంకర్, బండ్ల మాధవ రావు, ఎం.వి.రామిరెడ్డి లు సంపాదకులుగా ఉన్న ఈ సంకలనానికి కథలు పంపవలసిన చిరునామా:

డా. పాపినేని శివసంకర్
3వ లైన్, విద్యానగర్
గుంటూరు - 522 006.

లేదా

బండ్ల మాధవ రావు
306,రాచకొండటవర్స్
అల్వాల్, సికింద్రాబాద్ - 500 010.

లేదా

ఎం.వి రామిరెడ్డి,
కోట రెసిడెన్సి, పోలీస్ స్టేషన్ దగ్గర
మియాపూర్, హైదరాబాద్.

- బండ్ల మాధవ రావు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)