వ్యర్ధ మరణం శూన్య ఆకాశం
ఏదీ మిగల్చకుండా
గడచిన కాలాన్నీ పాము కుబుసంలా
వదిలేస్తూ పాకుతూ వెళ్ళి పోతుందీ
నిద్ర పట్టని రాత్రుళ్లు కన్నీటిధారలు
మౌనాన్నీ ఛేదించలేక తపన పడతాయీ


మృత్యువు ఇంటిపునాదులను కూల్చేస్తుందీ
కూలిన కప్పూ కింద నలిగిన జీవితాలు
కడుపులో శోకాలు అగ్నిపర్వతాలు
ఎంత వద్దునుకొన్నా పాత జీవితం
కళ్ళముందు కదలాడుతూంటే
మరచి పోలేక వ్యక్తిని వెదుకుతూ
పలుకరిస్తే చాలు కన్నీటివర్షాలను రాల్చుకుంటూ
బతుకునీ మోస్తాయి
అంగుళం కదల్చలేని పాదాలను సవరించుకుంటూ
నడిచే నడకలు తడబడి కూలబడతాయి
వెళ్ళిపోయిన వ్యక్తి చిరునామాలు
కళ్ళలో మిగిలిపోతాయి
మాటిమాటికీ రెప్పలన్నీ ఒరుసుకొని
పారే నీటితడిలో ఇంకిపోతాయి
ఎక్కడి మరణం అయినా
శూన్య ఆకాశంలా అగుపడుతుందీ…

ఒక్క అభిప్రాయం

  1. Raghothama Rao C 06 ఏప్రిల్ 2007 , 12:15 pm

    చాలా సాధారణంగా ఉంది. బహుశా మీ భావ తీవ్రత మీ మాటలకు అందకుండా పోయిందేమో!!!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)