- కొండేపూడి నిర్మల
పసుపూ గంధం పన్నీటి మడుగుల్లో దూకిన
వెనకటి తరం శారీరక స్పృహకంటే
అందాల వ్యాపారం కోసం అందవిహీనమవుతున్న
వ్యవస్థకి బానిసగా
ఈ సామాజిక స్పృహ నన్నెక్కువ దగా చేస్తోంది
దేశాలమధ్య శత్రువ్యూహాల్ని
శవాలు లెక్కతేలుస్తాయి
దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అంకెల్తోసహా దొరుకుతాయి
అక్కాతమ్ముళ్ళమధ్య
ఇప్పుడు రక్త సంబంధం ఒక వలస రాగ సంబంధం, ఒక వెట్టి
పంటెవరు దోచుకున్నాసరే
బీడు వదలని రైతొక గాడిద
ఫలమెవరి పేరిట చెలామణి అవుతున్నా సరే
పురిటి నొప్పి తీస్తున్న తల్లొక గాడిద
పదమెవరు దోచుకున్నాసరే
పాటమానని గాయకుడొక గాడిద గాడిద
కన్నీళ్ళమీద పరిశోధన జరక్కపోవచ్చు
వెనక కాళ్ళ వడ్డింపులుంటాయని రుజువులున్నాయి.
ప్రజాకళ చదివాను. చాలా సంతోషం అనిపించింది. ప్రస్తుతం వున్న వాటిలో మీ సంచిక ఒకటే సీరియస్ గా నడుస్తోంది.
- కొండేపూడి నిర్మల