రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ, ప్రవాస ప్రజల నుండి వచ్చే అన్నిరకాల ప్రజాసాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావలని ప్రజాకళ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా రచయితలు, సాహిత్యాభిమానులు ప్రజాకళకు తమ రచనలను పంపించి సహకారం అందించవలసినది విజ్ఞప్తి చేస్తున్నాం.

ఒక్క అభిప్రాయం

  1. దుప్పల రవికుమార్ 10 డిసంబర్ 2007 , 12:03 am

    అస్తిత్వ వాద ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ వెల్లువెత్తుతున్న ఈ కీలక సమయంలో భాష పాత్ర చాలా కీలకమైనది. అది మీకూ తెలుసు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలు తమని తాము కళింగాంధ్ర ప్రజలమని పిలుచుకోవడానికే ఇష్టపడతారు. గురజాడ కళింగాంధ్ర చరిత్ర రాయాలని ప్లాన్ చేసుకుని రాయలేకపోయారు. చాసో కళింగ కథల్ని తెచ్చారు. కె.ఎస్. చలం, హయగ్రీవరావ్ తదితరులు సమకాలీన కాలంలో కళింగాంధ్ర సామాజిక, ఆర్థిక పరిస్తితులను పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా తెలుగు ప్రజలకి తెలియజెప్తున్నారు. కాని ఇక్కడికి దూరంగా ఉందేవాళ్లు మాత్రం భౌగోళికంగా సూచన కోసం ఉత్తరాంధ్ర అంటున్నారే గానీ, మరోలా కాదు. కాని, సాహిత్యకారులు మాత్రం ‘కళింగాంధ్ర ‘ అనే పదాన్ని వాడాలని కోరుతున్నాను.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)