boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

మార్చ్, 2007 సంచిక

iraqwar_5.jpg

దేశాలమధ్య శత్రువ్యూహాల్ని
శవాలు లెక్కతేలుస్తాయి
దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అంకెల్తోసహా దొరుకుతాయి
అక్కాతమ్ముళ్ళమధ్య
ఇప్పుడు రక్త సంబంధం ఒక వలస రాగ సంబంధం, ఒక వెట్టి

వ్యర్ధ మరణం శూన్య ఆకాశం
ఏదీ మిగల్చకుండా
గడచిన కాలాన్నీ పాము కుబుసంలా
వదిలేస్తూ పాకుతూ వెళ్ళి పోతుందీ
నిద్ర పట్టని రాత్రుళ్లు కన్నీటిధారలు
మౌనాన్నీ ఛేదించలేక తపన పడతాయీ

పూర్తిగా చదవండి »

నందిగ్రామ్ రైతులుపై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను ఖండించండి!
మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను కాపాడండి!

పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందిగ్రామ్ గ్రామంలో సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇండోనేషియాకు చెందిన ‘సలీం గ్రూప్’ అనే ప్రెవేటుకంపెనీకి ఉచితంగా ఇస్తోంది. రైతుల, రైతుకూలీల జీవనోపాధి పైన దాడిచేస్తోంది. పచ్చని పచ్చని పొలాల మధ్య కాలుష్యాన్ని విరజిమ్మే కెమికల్ ప్యాక్టరీని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ నందిగ్రామ్ రైతులు ఉద్యమిస్తున్నారు.

పూర్తిగా చదవండి »

- డా. దార్ల వెంకటేశ్వరరావు

మన ప్రాచీన తెలుగు సాహిత్యం స్త్రీని ఒక భోగ వస్తువుగా చిత్రించటంలో భావజాలం ప్రాత్ర చాలా ఉంది. రామాయణం , మహా భారతం, భాగవతం, ప్రబంధాలు , శతకాలు మొదలైన వాటిన్నింటిలోనూ ఈ భావజాల ప్రభావం ఉంది . సర్వ సాధారణంగా భావజాలం దేశ , కాలానుగుణంగా రూపొందుతుంది. మన భారత దేశంలో వేదాలు, స్మృతులు, పురాణాల రూపంలో హిందూభావజాలం ఉంది .

పూర్తిగా చదవండి »

P.Satyavathy విలక్షణమైన వస్తువుని అత్యంత స్పష్టతతో కథగా మలచగలిగిన శక్తిగల అతి కొద్దిమంది రచయితలలో సత్యవతి ఒకరు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి - మూడు కథా సంపుటాలు, మర్రినీడ, గొడుగు అనే రెండు నవలలు ప్రచురించారు. ఇవికాక అనేక వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. ఇల్లలకగానే, సూపర్‌మామ్ సిండ్రోమ్ కథలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.

 
పూర్తిగా చదవండి »

* సారా ఉద్యమం గురించి…..

సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది.

పూర్తిగా చదవండి »

రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం.

పూర్తిగా చదవండి »

- డా. దార్ల వెంకటేశ్వరరావు

gorky4.jpg

మానవుడు ఉన్నతత్వం సాధించే పరిణామాన్ని వర్ణించిన నవల మాక్సిమ్ ‌ గోర్కీ ‘అమ్మ’ నవల అని ప్రజా సాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు . 09 - 03 - 2007 సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు లో జరిగిన సమావేశంలో ‘అమ్మ’ నవలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ముఖ్య వక్తగా ఆయన మాట్లాడారు . వ్యష్టి నుండి సమష్టికి పయనించటమే ‘అమ్మ’ నవల ధ్యేయం అని చెప్పారు.

పూర్తిగా చదవండి »

- పి. సత్యవతి

mahasweta_devi.jpg

‘శిశు’ వంటి అత్యుత్తమ కథ వ్రాయలన్నా. ‘హజార్ చౌరాసి కా మా’ ‘అరగ్రేర్ అధికార్’ వంటి గొప్పనవలలు వ్రాయాలన్నా, ద్రోపది, శనీచరి వంటి గొప్ప నవలలు వ్రాయాలన్నా - సంబంధిత ప్రజలతో పరిచయం - వారి పట్ల సానుభూతి వుండడం ఒక్కటే చాలదు.

పూర్తిగా చదవండి »

- కె.శివారెడ్డి

కళ్ళకింద బావులేర్పడతాయి
మొగ్గల్లా ముఖంమీదకి పొడుచుకొచ్చి విప్పారిన కళ్ళు
ఇప్పుడు బావిలో పడిపోయిన మట్టిముంతలు
సూర్యోదయం మీద లేతతమలపాకులా నవనవలాడిన
ముఖం నేడు అనూహ్యాఅకాల జీర్ణపత్రం
ఒకప్పుడు అన్ని కాలాలూ మిళితమై
ఆమె ముఖంలో లాస్యం చేసేవి

పూర్తిగా చదవండి »

     - కొండేపూడి నిర్మల

పసుపూ గంధం పన్నీటి మడుగుల్లో దూకిన
వెనకటి తరం శారీరక స్పృహకంటే
అందాల వ్యాపారం కోసం అందవిహీనమవుతున్న
వ్యవస్థకి బానిసగా
ఈ సామాజిక స్పృహ నన్నెక్కువ దగా చేస్తోంది

పూర్తిగా చదవండి »

- కౌముది

బిడ్డా!
చానాదినాలయింది
కండ్లల్లో కన్పిత్తానవు
నిన్ను సూడాలని మనసంతా పీకుతంది
ఏ పని చేద్దామన్నా మనసు సుదురాయించడంలేదు
అప్పుడా ఇప్పుడా నాలుగైదేండ్లయింది
నిన్ను సూడకుంట ఒక గడియ కూడా ఎప్పుడుండలే పూర్తిగా చదవండి »

- జాన్ హైడ్ కనుమూరి

నిదురించిన రాత్రిలో కల కన్నట్టు
కనురెప్పల్లో కదుల్తున్న దృశ్యాలు
రెప్పతెరిచిన వేళ కళ్ళముందులేనట్టు
వాస్తవ అవాస్తవాల నడుమ
కొట్టుమిట్టాడుతున్న మనసు
బద్దలు కొట్టి
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి
పూర్తిగా చదవండి »

- హెరాల్డ్ పింటర్

తప్పించుకునేందుకు దారిలేదిప్పుడు
పెద్ద పోటుగాండ్లు బయటకి వస్తున్నారిప్పుడు
కనిపించిదల్లా దోచుకుంటారిప్పుడు
వెనకముందు చూసినడవాలిప్పుడు

- రంగనాయకమ్మ
 

క్లారాజెట్కిన్ వంటి కమ్యూనిష్టులు 1910లో దీన్ని ప్రతిపాదించినప్పుడు,  ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ అన్నారు. శ్రామిక మహిళలకు పని పరిస్థితుల్లో హక్కుల గురించీ, సోషలిస్టు పోరాటాల గురుంచీ, స్పృహ కలిగించాలనే దృష్టితో, కానీ క్రమంగా దీన్ని బూర్జువా ప్రభుత్వాలన్నీ, ‘శ్రామిక మహిళా దినం’ లో నించి ‘శ్రామిక’ ని తీసివేసి, ‘అంతర్జాతీయ మహిళా దినం’ గా మార్చాయి. అన్ని ఉత్సవాల్లాగే ఈ ‘ఉత్సవం’ కూడా ఏటా సభలు, సెమినార్లూ, సన్మానాలూ వంటి వాటితో కేవలం ‘తంతు’ లాగా, ‘కర్మకాండ’ లాగా జరిగిపోతూ వుంటుంది. ఎన్ని ఏళ్ళు గడచినా  ఈ ‘దినోత్సవాల’ వల్ల మహిళలు నేర్చుకునే జ్ఞానమూ లేదు; సాధించే హక్కులూ లేవు. ఈ మహిళా దినాలు అప్పుడప్పుడూ చిట్టి పొట్టి సంస్కరణల్ని మాత్రమే ప్రతిపాదిస్తూ వుంటాయి.

పూర్తిగా చదవండి »

- ఉషా ఆరి

అమెరికా లో నివసిస్తున్న తెలుగు సమాజంలో గృహహింస ఉంటుందా ! అని చాలామంది నన్ను ప్రశ్నించారు. దానికి సమాధానం అవుననే చెప్పుకోవాలి. వాస్తవానికి గృహహింసకు గురైన స్త్రీల గురించి వినడమో, చూడడమో జరిగిందని మనలో చాలా మంది అంగీకరిస్తారు. కానీ దానిని కుటుంబ అంతర్గత వ్యవహారమని జమకడతారు. 2002 సంవత్సరంలో రాజ్ , సిల్వర్ మెన్ లు బోస్టన్ నగరంలో నివసించే 160 దక్షిణాసియా మహిళలతో గృహహింస పైన ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనములో తేలిందేమంటే; 40.8% శాతం మహిళలు జీవితకాలంలో తమ భర్తల చేతిలో భౌతికంగా, లైంగికంగా హింసలకు గురి అవుతున్నారు.

పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

ప్రపంచంలో ఎదురయే వింతలూ, విచిత్రమైన విషయాల పట్ల మనిషికి ఆదినుంచీ భయాలూ, అపోహలూ, ఆసక్తీ ఉంటూనే ఉన్నాయి. ఈ మూడు భావాలూ అదే క్రమంలో కలిగాయనేది కూడా నిజం. భయం తీరి, అపోహలు కాస్త కాస్తగా తగ్గాక పెరిగే ఆసక్తి వల్ల మనిషి పరిశోధనలూ, పరిశీలనలూ మొదలుపెట్టాడు. మొదట్లో ప్రకృతిని అర్థం చేసుకోవడం, తరవాత దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆరంభించాడు.

పూర్తిగా చదవండి »

- Next »