boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఫిబ్రవరి, 2007 సంచిక

- రవికిరణ్ తిమ్మిరెడ్డి

నిన్ననో మొన్ననో సరిగ్గా ఙ్ఞాపకం లేదు
పరుగాపి వెనక్కు చూస్తే ఎదురుగా
కనిపించీ కనిపించని గీతం
వినిపించీ వినిపించని గానం
పూర్తిగా చదవండి »

- ఎల్యెన్

కళ్ళే కాదు,
కలాలూ కలలు కంటాయ్.
నెగళ్ళే కాదు,
బయళ్ళూ జ్వలిస్తాయ్.
పూర్తిగా చదవండి »

- రాజు

వెరవని ధీరుడెవరో
వేకువనే వెళిపోతాడు
ఇది పశ్చాత్తాపాలు కూడని కాలం కదా
కత్తి అంచు రాత్రి మీద
పూర్తిగా చదవండి »

- బి.అజయ్ ప్రసాద్

అది కొన్ని పల్లెటూళ్ళను జాతీయ రహదారికి కలుపుతూ పొయే కాలిబాట. దారికిరువైపులా ఎండకు ఎండి నేలకు అణిగిపోయిన గడ్డి. అక్కడక్కడా ఒంగిచూస్తున్న ఈత చెట్లు. విసిరేసినట్లున్న పొదలు.

కాలిబాటమీద కొమ్ములూపుకుంటూ గేదె ఒకటి నడుస్తూ ఉంది. దాని రెండుకొమ్ముల మధ్య నుదిటిమీద తెల్లటి పొడవాటి మచ్చ పూర్తిగా చదవండి »

- షఫీ

మాసిన చొక్కా. చొక్కా గల్ల నుంచి మేఘంలా మెరుస్తున్న దేహం. ఎత్తు… ఎత్తుకు తగ్గలావు. అరేబియన్ ఇసుక ఎడారిలా ఎర్రని ఒంటి చాయ.

‘అరబ్బు నవాబులా ఉనాడు పిలకాయ. కారు కందెన పూసుకొని కార్ల కింద పొర్లాడాల్సినోడు కాదని షెడ్డులో పని చేయించుకోడానికి వచ్చేవాల్లు చెప్పే మాటలు మల్లీ ఎంటాడేవి. అరబ్బు దేశాలు కలల్లో కలవరపెట్టేవి’.
పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఇతర ఆలోచనల్లాగే భక్తి పారవశ్యమూ, మతపరమైన ఆధ్యాత్మిక భావాలూ కూడా మెదడులోని కొన్ని భాగాలలో జరిగే చర్యల వల్లనే కలుగుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అటువంటి నమ్మకాలేవీ లేనివారికి కూడా కృత్రిమంగా, మెదడును అయస్కాంత క్షేత్రానికి గురిచేసి అవే భావనలు కలిగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పూర్తిగా చదవండి »

Mumia

ప్రఖ్యాత జర్నలిస్ట్ అయిన ముమియా అబు-జమాల్ (Mumia Abu Jamal) 1954, ఏప్రిల్ 24న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. ఫిలడెల్ఫియాలో డేవిడ్ ఫాల్క్‌నర్ (David Faulkner) అనే పోలీస్ అధికారిని కాల్చి చంపాడన్న నేరారోపణపై ఆయన 1981 నుండి జైలులో, 1983 నుండి డెత్-రో పై (Death Row అంటే మరణ శిక్ష విధించబడి అది అమలయేందుకు ఎదిరి చూస్తూ జైలులో గడపడం) ఉన్నాడు. పూర్తిగా చదవండి »

- వట్టికోట ఆళ్వార్‌స్వామి

6

‘పాపం మీనాయనగారు పెద్దమనిషి. ఆయన గతించినప్పటి నుండి అన్నీ చిక్కులేనని విన్నాను'’ రామభూపాల్‌రావు మాట్లాడటానికి పిలిపించిన వెంకటాచారితో పరామర్శగా అన్నాడు.
రామభూపాల్‌రావు ఆవిధంగా శాంతంగా, చనువుగా మాట్లాడటం వెంకటాచారికి ఆశ్చర్యం వేసింది. రామభూపాల్‌రావు ఎల్లప్పుడు అధికార ధ్వనిలో మాట్లాడటం అతనికి తెలిసన సంగతి. రామభూపాల్‌రావు అంటే వెంకటాచారికి భయం కూడాను.
పూర్తిగా చదవండి »

గమనిక
గత ఐదు సంచికలుగా ప్రజాకళ సంపాదకవర్గంలో ఉన్న మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజాకళ నుండి వైదొలగుతున్నాం. ఇంతకాలం మాకు సహకరించిన, ఆదరించిన ప్రజాకళ పాఠకులకి మా ధన్యవాదాలు.- హిమబిందు, చైతన్య

ప్రతి సంవత్సరంలాగానే ఈసారికూడా కథానిలయం వార్షికోత్సవా లు ఫిబ్రవరి రెండవ శని, ఆదివారాల్లో జరుపుకుంటున్నది. 10వతేదీ శనివారం అతిథులతో ఇష్టాగోష్ఠి, పుస్తకావిష్కరణలు ఉంటాయి. 11వ తేదీ ఆదివారం కథానిలయం వార్షికోత్సవ సభ, రాచకొండ రచనా పురస్కారం ఉంటాయి. అనివార్యకారణాలవల్ల ఆహ్వానం అందడం బహు శా ఆలస్యం కావచ్చును. ఈ ప్రకటననే ఆహ్వానంగా భావించి అం దరూ రావలసిందిగా మనవి. మీరాకను ముందుగా తెలపగలిగితే వసతి సౌకర్యంలాంటి ఏర్పాటు చేయడానికి వీలుంటుంది.

- కాళీపట్నం రామారావు
- బివిఎ రామారావునాయుడు
విశాఖపట్టణం

« Prev -