- లాంగ్స్‌టన్ హ్యూస్
నెరవేరని కల ఏమవుతుంది?
ఎండలో ద్రాక్షలా చిక్కిపోతుందా?
లేదూ మానని పుండులా మండిపోతుందా?
లేదూ కుళ్ళిన మాంసంలా కంపుకొడుతుందా?
లేదూ తియ్యదనం పొంగిపొర్లే పానకమవుతుందా?
బహుశా బరువెక్కువై కుంగిపోతుందేమో -
ఏమో – ఉండి ఉండి పేలిపోతుందేమో ?
నెరవేరని కలేవవుతుంది? ఏవవుతుంది,
మనసు లోలోపలి పొరల్లో గ్నాపకవై వెలుగుతుంది
గుండె లోలోపల మిగిలే చిన్న గాయంలో విత్తనమై మిగులుతుంది
ఎప్పుడో వొకరోజు తిరిగి మనసులో రంగుల గాలిపటంలా ఎగురుతుంది
లేకపోతే వుండి వుండి ఎప్పుడో పేలిపోయి వేయి కలలుగా ఉదయిస్తుంది
రవికిరణ్ తిమ్మిరెడ్డి
నెరవేరని కల కొందరిని రాచపుండు లా సలుపుతుంది.కొందరి గుండెల్లొ గువ్వ
గూడు కట్టుకున్నట్టు ఒదిగి వుంటుంది.అపుడపుడు గుర్తొచ్చి కళ్ళళ్ళో కన్నీళ్ళై
కాలవలు కడుతుంది.ఒంటరిగా వున్నవేళ తీరకుండా మిగిలిపోయిన కల
తెగ కలవరపెడుతుంది.నెరవేరని కల కవిత నివురు కప్పిన నిప్పుల్లా వున్న నెరవేరని కలల్ని తట్టి లేపింది.అభినందనలు
తీరని కల అయినా, గడిచిన జ్ఞాపకమైనా ఇందులో పేర్కొన్న ప్రతిదీ అవుతుంది, అదేంటి అనేదాన్ని బట్టి.
–ప్రసాద్
http://blog.charasala.com