వర్తమాన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ, నడుస్తున్న చరిత్రపైన వ్యాఖ్యానిస్తాడు కవి. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలో నలిగిపోయిన లక్షలాది ఇరాకీ ప్రజల జీవితాలను వెలుగులోకి తెస్తాడు. ప్రపంచాన్ని కుదిపిన మూడు సన్నివేశాలను ఆధారంగా చేసుకొని రాసిన కవితలు. అప్పటి కాలమాన స్థితిగతులను ప్రతిబింబిస్తూ, వైవిధ్యంతో రాసిన కవితలు. ఒకప్పడు నియంత అయినా, ఇపుడు సామ్రాజ్యవాదానికి ఎదురునిలిచి పోరాడిన నాయకులలో ఒకడిగా సద్ధాంను చాలామంది గుర్తిస్తున్నారు. కొంతమంది నియంతగా జమకడుతున్నారు. అమెరికా పాలకవర్గాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, కుట్ర పన్ని సద్ధాంను ఉరితీసి చంపించారు. హెచ్చార్కె కవిత్వం ఈ తరానికి ఒక చరిత్రపాఠం చెబుతుంది.

ఒక్క అభిప్రాయం

  1. satyanarayana 20 ఫిబ్రవరి 2007 , 11:32 pm

    అయ్యా ! దయచేసి మీ తెలుగు సవరించుకోండి. ఉల్లంగించి కాదు ఉల్లంఘించి - మూడు కాలాలు ఏమిటి - ఈ సన్పాదకీయ నోటు ఎవరు రాసారు? మరీ ఇంత అగ్నానమేమిటి?

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)