- హెరాల్డ్ పింటర్

మళ్ళీ వస్తున్నారు యాంకీలు
ఆయుధాలతో సైనికకవాతు చేస్తూ
ఆనందంతో సైనికగీతాలు పాడుతూ
అమెరికా దేవుడిని పొగుడుతూ
ప్రపంచమంతా దూసుకొస్తున్నారు
యుద్ధంలో పాల్గొనని వాళ్ళు
పాడటం నిరాకరించిన వాళ్ళు
గొంతు కోల్పోయిన వాళ్ళు
రాగం మరిచిపోయిన వాళ్ళు
వాళ్ళ శవాలన్నీ మురికి కాల్వల్లో చిక్కుకున్నాయి
సవారీల కొరడా దెబ్బలకు రక్తం చిందుతుంది
నీ తల ఇసుకలో రాలిపోతుంది
నీ తల మురికిలో కూరుకుపోతుంది
నీ తల దుమ్ములో మాసిపోతుంది
నీ కళ్ళు చీకటిలో మ్రగ్గిపోతాయి
నీ ముక్కు కుళ్ళిన శవాలకంపుని పీలుస్తోంది
అమెరికా దేవుడి వాసనతో
మరణించిన గాలిప్పుడు సజీవమైంది
Harold pinter is a wonderful writer.In 2005 that is on his 75th year,the dramatist and screenplay writer has taken decision of writing poetry only. He has termed American war on Iraq “a premeditated mass murder” and also says that country is run by “a bunch of criminal lunatics”.I request one of the translators to do his Nobel Prize Winning speech “Art,Truth and Politics” in telugu if it is not done.It is available on guardian.co.uk.