boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఫిబ్రవరి, 2007 సంచిక

picaso

చిత్రం: గ్వెర్నికా (Guernica) - పాబ్లో పికాసో

అమెరికా సామ్రాజ్యవాదాని ద్వేషించకుండా
ఆకాశాన్నీ, నేలనూ ప్రేమించలేనని తెలుసుకున్నా.
మార్కెట్ రక్త పింజెరను మట్టుపెట్టకుండా
మల్లెపూలవంటి పసిపిల్లల చిరునవ్వుల్ని
మాసిపోకుండా కాపాడుకోలేమని తెలుసుకున్నా

వర్తమాన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ, నడుస్తున్న చరిత్రపైన వ్యాఖ్యానిస్తాడు కవి. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలో నలిగిపోయిన లక్షలాది ఇరాకీ ప్రజల జీవితాలను వెలుగులోకి తెస్తాడు. ప్రపంచాన్ని కుదిపిన మూడు సన్నివేశాలను ఆధారంగా చేసుకొని రాసిన కవితలు. అప్పటి కాలమాన స్థితిగతులను ప్రతిబింబిస్తూ, వైవిధ్యంతో రాసిన కవితలు. ఒకప్పడు నియంత అయినా, ఇపుడు సామ్రాజ్యవాదానికి ఎదురునిలిచి పోరాడిన నాయకులలో ఒకడిగా సద్ధాంను చాలామంది గుర్తిస్తున్నారు. కొంతమంది నియంతగా జమకడుతున్నారు. అమెరికా పాలకవర్గాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, కుట్ర పన్ని సద్ధాంను ఉరితీసి చంపించారు. హెచ్చార్కె కవిత్వం ఈ తరానికి ఒక చరిత్రపాఠం చెబుతుంది.

- హెచ్చార్కె

ఒక పద్యం ఉరితీయబడింది
పద్యాలెప్పుడూ ఉరి తీయబడుతూనే ఉన్నాయి.

బహుశా, ఏ మంచి పద్యానికయినా
ఉరి వుచ్చులో కాసేపు గిలగిల్లాడడమే
సరయిన చివరి చరణం అనుకుంటాను
శతృవేదిక మీద నిటారుగా నిలబడి
మృత్యువు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడమే
పద్యం తన సజీవత్వానికి తాను
పెట్టుకునే పరీక్ష అనుకుంటాను
అందుకే పద్యం చివరి శ్వాసలోనూ
ముఖం మీద ముసుగును తిరస్కరిస్తుంది

పూర్తిగా చదవండి »

- హెచ్చార్కె

ఊరిచివరి పేటలోని పేదపిల్ల
జమీందారు మీద కోపంతో
బందిపోటుదొంగను ప్రేమిస్తుంది
నా ప్రియమైన భూగోళమిప్పుడు
సద్దామ్ హుస్సేన్ ను ప్రేమిస్తోంది
అమెరికన్లు టాయిలెట్ పేపర్ మీద ముద్రించినా
సద్దామ్ హుస్సేన్ మురిక్కాల్వలో కొట్టుకుపోడు
పూర్తిగా చదవండి »

- హెచ్చార్కె

కవిత్వం కావాల్ట, కవిత్వం
సత్యంతో కలుషితం కాని స్వచ్చమైన కవిత్వం

ఆ పిల్లాడు చాక్లెట్ల కోసం యేడవడం లేదు
బాంబుల దాడిలో తెగిపోయిన
రెండు చేతుల కోసం యేడుస్తున్నాడు
దేశాల కోసం జెండాల కోసం కూడా కాదు
గుండెలు బాదుకోవడానికి
రెండు చేతులు లేవని యేడుస్తున్నాడు
యిప్పుడు కవిత్వం కావాల్ట , కవిత్వం
పూర్తిగా చదవండి »

- వరవరరావు

ఎంత మార్పు!
’సద్దాం చచ్చిపోతాడా?’
’చచ్చే పోయాడంటున్నారు కదా’
‘ఆ స్వరం ఎప్పుడో రికార్డు
చేసిందంటున్నారు కదా’
’బాగ్దాద్ నగరం నిప్పుల వర్షంలో
దగ్ధమైపోతున్నది కదా’
’అలెండీ వలె సద్దాంను కూడా
చంపేస్తారా?

పూర్తిగా చదవండి »

- సినాన్ అంటూన్

యుద్ధంలో చిధ్రమైనప్పుడు
మరణాన్ని తలుచుకుంటూ నేను కుంచె పట్టాను
యుద్ధం గోడ మీద కిటికీ బొమ్మ గీసాను
ఆ కిటికీ తెరిచి అంతా వెతికాను
మళ్ళీ మరొక యుద్ధం కనిపించింది
గర్భాశయంలో వుండగానే మరణించిన బిడ్డపై
ఖఫన్ కప్పుతున్న తల్లి కనిపించింది

- హెరాల్డ్ పింటర్

haroldpinter_2.jpg

మళ్ళీ వస్తున్నారు యాంకీలు
ఆయుధాలతో సైనికకవాతు చేస్తూ
ఆనందంతో సైనికగీతాలు పాడుతూ
అమెరికా దేవుడిని పొగుడుతూ
ప్రపంచమంతా దూసుకొస్తున్నారు

పూర్తిగా చదవండి »

-ఎన్. వేణుగోపాల్

తెలంగాణ చరిత్ర విశ్లేషణ 1
.
తెలంగాణ చరిత్ర విశ్లేషణ 2

వీడియో ఉపన్యాసాలు

- ప్రొఫెసర్. హరగోపాల్

కందుకూరి రమేశ్ బాబు రాసిన “బతికిన కోడి” పుస్తక పరిచయాన్ని వీడియో లో చూడండి

బతికిన కోడి: పుస్తక పరిచయం

మూసీ టీవీ
telanganamedia.com

గాయని: మాభూమి సంధ్యక్క


వీడియో పాట

మూసీ టీవీ
www.telanganamedia.com

ఆట - పాట 1

ఆట - పాట 2

.

గద్దర్ 1

గద్దర్ 2

గద్దర్ 3

గద్దర్ 4

మూసీ టీవీ
www.telanganamedia.com

Langston Hughes

Langston Hughes

- లాంగ్స్‌టన్ హ్యూస్

నెరవేరని కల ఏమవుతుంది?
ఎండలో ద్రాక్షలా చిక్కిపోతుందా?
లేదూ మానని పుండులా మండిపోతుందా?
పూర్తిగా చదవండి »

- మాయా ఏంజిలో

Maya Angelou

నువ్వు నీ చేదైన అబద్దాలతోటీ
వంకర రాతలతోటీ
చరిత్రలో నన్ను అణిచెయ్యాలని
చూస్తావు -
నన్ను నీ కాలికింద దుమ్ములా తొక్కేయాలని
చూస్తావు -
అయినా నేను
లేస్తాను – ఆ దుమ్ములాగానే !

పూర్తిగా చదవండి »

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా ప్రజాకళ ప్రత్యేక సంచిక తీసుకురావలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఫెమినిజం, స్త్రీ సాహిత్యం, ప్రవాసంలో మహిళలు అనే అంశాలపైన రచనలు సేకరిస్తున్నాం. మీ రచనలద్వారా ప్రజాకళ కు సహకారం అందించవలసినది గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీకు తెలిసిన ప్రముఖ సాహిత్య రచనలు సేకరించి పంపించగలరు.
- ప్రజాకళ
ఈమేల్ ఐడి: Editor@Prajakala.org

- ఇంద్రాణి పాలపర్తి

ఇల జారిన పువ్వులతో
అల చేరిన గువ్వలతో
కలల కాయలు కాచిందీ చెట్టు.
పూర్తిగా చదవండి »

- Next »