boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

జనవరి, 2007 సంచిక

- ఖాజా

Madduri Nageshbabuదళిత సాహిత్య ఉద్యమానికి వెన్నుగర్ర నగేష్ బాబు. వచన కవిత్వం కేవలం కొంతమంది చదువుకున్న మేధావుల కోసమే కాదు. వాడ వాకిట్లో నిల్చున్న కోట్లమంది చదువులేని వారికి, సామాన్య జనానిక్కూడా అని చెప్పి – వాళ్ళకు అర్థమయ్యేలా, వాడ యాసనూ, భాషనూ, నుడికారాన్నీ, లాజిక్ నీ తెచ్చి కవిత్వంగా మలిచాడు నగేష్ బాబు.

నగేష్ బాబు రాయటం మొదలు పెట్టాక వచన కవిత్వం సామాన్యులు చదువుకునే లేదా ఎవరైనా చదివితే విని ఆనందించే కథా కావ్యమైంది. జనరంజకమైంది. మేలుకొలుపు గీతమైంది.

పూర్తిగా చదవండి »

- చెరబండరాజు

ఏ కులమబ్బీ
మాదే మతమబ్బీ ॥ ఏ కుల ॥

మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు ॥ ఇల్లు ॥
డొక్కలెండి కోండ్రలేసి
ధాన్యరాసు లెత్తినపుడు ॥ ఏ కుల ॥ పూర్తిగా చదవండి »

- గద్దర్

యాలరో ఈ మాదిగ బతుకు
మొత్తుకుంటె దొరకదురా మెతుకు
నీకు మొత్తుకుంటె దొరకదురా మెతుకు ||యాలరో|| పూర్తిగా చదవండి »

-శివసాగర్

నల్ల నల్ల సూరీడు
నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపు దారి సూరీడు
పూర్తిగా చదవండి »

-గోగు శ్యామల

సలికెపారను బుజం మీద పెట్టుకొని యిలాతికాయ మడుల ఒరాల పోంటి జవానులా తిరుగుతున్నది బాలమ్మ. రాళ్ళ కుచ్చెల మీది సేన్ల నానుకొని వంకర్లు తిరిగిన పిల్లకాలువ నిండ నీల్లు పారుకుంట బాలమ్మ సేన్లకు వస్తున్నయి. మీదున్న అన్నిసేన్ల మడులు అడ్డుకట్టలు కట్టడం వల్ల కాల్వనిండ నీల్లు పారుకుంట బాలమ్మ సేన్లకే ఒస్తున్నయి. పెద్ద పెద్ద ఇలాతికాయ మడులు జెల్ది జెల్ది పారుతున్నయి. పెద్దబందాలకు నీల్లు పెట్టే బాలమ్మకు నిండా పన్నెండేండ్లు నిండలేవు.
పూర్తిగా చదవండి »

- ఆచార్య కొలకలూరి ఇనాక్

నేటి తెలుగుదేశంలో అదొక మారుమూల పల్లె. కుగ్రామం. రావడంటే మనిషికాదు, మర సూర్యుళ్ళా పొలంలో పొడిచి, ఇంట్లో కుంకుతుంటాడు. చేనుకి చెమటతో స్నానం చేయించి, నెత్తురుతో బొట్టు పెడుతుంటాడు. పంట చేను పసి పాపల ముత్తయిదుతే పైరును ఆస్తారుబస్తంగా చూసుకొంటాడు. పూర్తిగా చదవండి »

-వట్టికోట ఆళ్వార్‌స్వామి

కొన్నాళ్ళకు గొట్టం కోటయ్య మరణించాడు. కోటయ్య జీవించి ఉన్నప్పుడే కొమరయ్యకు పెండ్లి చేశాడు. తల్లి అన్నమ్మ అనుభవాన్ని ఊతగా తీసుకొని కొమరయ్య వ్యవసాయం పొదుపుగా సాగిస్తున్నాడు. కొమరయ్యకు ఒక కొడుకు కూడా పుట్టాడు. తండ్రి పేరే పెట్టుకున్నాడు కొడుకుకు. ఒకసారి కంఠీరవం కోటయ్యను యెత్తుకొని ముద్దులాడ్తు, “కొమరయ్యా! కోటయ్య పేరేమీ బాగులేదు. ‘ముద్దులకోట’ అని పెట్టు” అన్నాడు. అన్నమ్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది. కోడలు కనకమ్మ క్షణంపాటు కొడుకును చూచి, ఒక చిరునవ్వు విసిరింది.

పూర్తిగా చదవండి »

- మమత

ఒక సాయంత్రం మా యునివర్సిటీ బస్టాపులో ఇద్దరి మధ్య సంభాషణ విన్నాను. ఒకాయన పోనీటెయిల్ వేసుకొని వున్నాడు. మెడలో ఒక చోకర్ ఉంది. అతను ఇంకొకతనితో “నాలో నేటివ్ అమెరికన్ రక్తం ఉందని మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి నేటివ్ అమెరికన్ ఆచారాలను పాటిస్తున్నాను” అని అన్నాడు. అప్పటికే నేటివ్ అమెరికన్ల గురించి తెలుసుకోవాలన్న నా ఆసక్తి వల్ల వాళ్ల సంభాషణ విందామని, వీలయితే అతనితో మాట్లాడుదామని వారికి దగ్గరగా జరిగాను.

పూర్తిగా చదవండి »

« Prev -