- ఖాజా
దళిత సాహిత్య ఉద్యమానికి వెన్నుగర్ర నగేష్ బాబు. వచన కవిత్వం కేవలం కొంతమంది చదువుకున్న మేధావుల కోసమే కాదు. వాడ వాకిట్లో నిల్చున్న కోట్లమంది చదువులేని వారికి, సామాన్య జనానిక్కూడా అని చెప్పి – వాళ్ళకు అర్థమయ్యేలా, వాడ యాసనూ, భాషనూ, నుడికారాన్నీ, లాజిక్ నీ తెచ్చి కవిత్వంగా మలిచాడు నగేష్ బాబు.
నగేష్ బాబు రాయటం మొదలు పెట్టాక వచన కవిత్వం సామాన్యులు చదువుకునే లేదా ఎవరైనా చదివితే విని ఆనందించే కథా కావ్యమైంది. జనరంజకమైంది. మేలుకొలుపు గీతమైంది.
రాయడాన్ని వృత్తిగా మార్చుకున్న నాగేష్ బాబు జనవరి 10,2005 న విశ్రాంతి ప్రకటించాడు. అంబేద్కర్ తో మొదలైన దళిత ఉద్యమ రథాన్ని మరికొంత ముందుకు నడిపి బాధ్యతలను గుర్తుచేసి నిష్క్రమించాడు.
నగేష్ బాబు రాసిన వెలివాడ, రచ్చబండ, మీరేవుట్లో, లోయ, నరలోక ప్రార్థన గ్రంథాలు దళిత సాహిత్యానికీ, ఉద్యమానికీ కూడా కొత్త చూపునీ వూపునీ ఇచ్చాయి. ఒక దృష్టికోణాన్ని, సాహిత్య దృక్పథాన్నీ, తాత్వికతనూ అందించాయి.
దళిత ధిక్కార కవిత్వం – నిశాని, దళిత సహానుభూతి కవిత్వం, కాస్త సిగ్గుపడడాం, సంకర కవిత్వం –ఊరూ-వాడ, అంబేద్కరిస్టు ప్రేమకవిత్వం – విడి ఆకాశం. ఇవ్వన్నీ నగేష్ బాబు క్రియేటివ్ ఆలోచనలకు నిదర్శనాలు.
ప్రశ్న: దళిత ఉద్యమం ముక్కలైపోయిందని దళిత ఉద్యమం పనైపోయిందని చాలా మంది అంటున్నారు మీరేవంటారు?
జ: చాలా మంది అంటే ఎవరు? వివరించు.
ప్రశ్న: అగ్రకులాలవాళ్లు ముఖ్యంగా ఇంతకుముందు కవిత్వంరాసి దళిత కవిత్వం వచ్చాక ఆగిపోయినవాళ్ళు.
జ: క్లియర్‌గా చెప్పాలంటే అగ్రకులాల వాళ్లు అని బేసిగ్‌గా అగ్రకులాల వాళ్ల డ్రీమ్ అది. కానీ అది నిజం కాదు. దళిత ఉద్యమం రోజు రోజుకి బలోపేతం అవుతుంది. ఉదాహరణకి కవితాత్మకంగా చెప్పాలంటే అనేక నదులొచ్చి బంగాళాఖాతంలో కలవడం అనేది నిన్నటి నిజమైతే బంగాళాఖాతమే నదులు నదులుగా విస్తరిస్తూ పోవడం అనేది నిజం. మేమందరం కలిసున్నాం అనే నిజంకాని ఒక అవాస్తవిక భ్రమలో ఇన్నాళ్లూ చాలా ఉద్యమాలు కలిసున్నట్లు నటించాయి. దళిత ఉద్యమం తెచ్చిన గొప్ప మార్పేంటంటే పోరాడాల్సిన అంశాలు వేరుగా వుండి అనవసరంగా కలిసి ఉండి పోరాటాన్ని వాయిదా వేసుకోవటం కన్నా ఎవరి ప్రత్యేకమైన అంశం కోసం వారు విడిపోయి పోరాటం చేయటం అనేది దళిత ఉద్యమం తచ్చిన గొప్ప వాంఛనీయమైన మార్పు. అంటే ‘విడిపోవట’ మంటే టోటల్‌గా ఉద్యమం నించి విడిపోవటం కాదు. దళిత ఉద్యమం అనేది అనేక కులాల కలయిక కాబట్టి ప్రతీ కులానికీ తనదైన సమస్య ఉంటుంది. తనదైన సమస్యని పరిష్కరించుకోటానికి ఏ కులానికాకులం పోరాడుతుంటది. తతిమ్మా దళిత కులాలు ఆ పోరాటానికి మద్దతు తెలియజేస్తా వుంటాయి. టోటల్‌గా కుల నిర్మూలన అనే క్రమంలోనే ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదా: మాదిగ హక్కుల దండోరా అలాగే తుడుందెబ్బ ఇట్ల ప్రతి కుల ఉద్యమం కూడా - టోటల్‌గా మళ్లీ అన్నిటి ధ్యేయం కుల నిర్మూలనే అంటే ఇప్పుడు దళిత ఉద్యమం అనేది అనేక రూపాల్లో విస్తరించిందని చెప్పుకోవాలిగానీ దాని పనైపోయిందనుకోవడం అవివేకం అని నేననుకుంటున్నా.
ప్రశ్న: అంటే దళిత ఉద్యమం ఎప్పటికీ ఉండాలనీ మీరు అనుకుంటున్నారా? దీనికి లక్ష్యం అంటూ ఏమన్నా వుందా?
జ: ఇది పెద్ద పనికి మాలిన ప్రశ్న. దళిత ఉద్యమం ఎప్పటికీ ఉండాలని ఎవరైనా కోరుకున్నారంటే వాడు అజ్ఞానిగా నేను భావిస్తా. అవమానాన్ని అవహేళనని తట్టుకోలేక ఆక్రోశం, ఆగ్రహం బద్ధలై చిమ్మిన లావా దళిత ఉద్యమం. కులం వల్ల దళిత ఉద్యమం వచ్చింది. కులం ఎంత తొందరగా నిర్మూలించబడితే దళిత ఉద్యమం అంత తొందరగా నశించిపోద్ది. తొందరగా దళిత ఉద్యమం నశించిపోవాలని అగ్రకుల కవులకంటే నేనే ఎక్కువగా కోరుకుంటునా అంతేగానీ దళిత ఉద్యమం ఎప్పటికీ ఉండాలి, దళిత కవులుగా ఎప్పటికీ మేం జ్ఞానపీఠ్ అవార్డులు కొట్టుకోవాలని అనుకోవట్లేదు. ఉదాహరణకి ఈ దేశం బేసిగ్‌గా దళితులది. ఈ దళితుల దేశం దళితుల పరమయ్యేంత వరకూ దళిత ఉద్యమం ఉంటుంది. అంటే దళితుడు తన రాజ్యాన్ని తను ఏలుకునేవరకన్నమాట. దానికి ఇప్పుడే పునాదులు ఏర్పడ్డాయ్. నాకో పెద్ద ఆశ ఉంది. నేను బతికుండాగా దళిత ఉద్యమం సఫలమైద్దని. దీనికి ప్రోలాంగ్డ్ ఉద్యమాలు చెయ్యాల్సిన పనిలేదు. అంబేడ్కర్ ఆశయాన్ని తీసుకుని ఈనాడు జరిగే ఉద్యమాలు సఫలమవుతాయని నా నమ్మకం.
ప్రశ్న: ఎస్.సి. రిజర్వేషన్ విభజన మీద మీ అభిప్రాయం ఏంటి?
జ: ముందుగా నేను మాల కులస్తుణ్ని. రిజర్వేషన్ విభజన కోరుతుంది మాదిగలు. రిజర్వేషన్ విభజన తప్పనిసరిగా జరగాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఒక దుర్మార్గమైన పరిస్ధితి ఏంటంటే ఎవరో విసిరిన ఎంగిలి రొట్టె కోసం ఈ రోజున కొట్టుకోవటం దూషించుకోవటం చివరికి మీరా సాబ్ లాంటి తమ్ముళ్లని చంపుకునే దుస్ధితి ఏర్పడింది. చాలా అన్యాయం. ఇది అగ్రకులతత్త్వం తప్పితే ఇది దళితతత్వం కాదు. ఈదేశంలో ఎనభై ఐదు శాతం మంది దళిత బహుజనులున్నారు. ఈ ఎనభై ఐదు శాతం మందికి 15 శాతం మంది 50% రిజర్వేషన్ ఇచ్చి, మీరు దాంట్లో కొట్టుకోండి మిగితాది మేం ఏలుకుంటాం అని అంటం జరుగుతుంది. ఇప్పటికైనా దళితులందరు కలిసి రిజర్వేషన్ విభజన అనేది అటు నుంచి నరుక్కురావాలి. అంటే 15శాతం వున్న అగ్ర కులస్తులకు 15శాతం రిజర్వేషన్ ఇచ్చి … 85శాతం దళితులకి బహుజనులకి మధ్య పంచాలి. అప్పుడు 7శాతమే కాదు మాదిగలకి అవసరమైతే 15% ఇరవైశాతం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యకీ ఉద్యోగాలకీ బాగా వెనకబడిపోయి వున్నారు. వీళ్లని అప్‌లిఫ్ట్ చేయటానికే రిజర్వేషన్లు ఉన్నది. ఇవేం అగ్రకులస్తుల సొంత ఆస్తులు కావు. అలా అగ్రకులస్తులకే మనం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈదేశం మనది. ఎప్పుడో సింధూలోయ నాగరికత ఆర్యుల దండయాత్ర నాడు కొందరు అగ్రకులస్తులు ఈ దేశంలో ప్రవేశించారు. పాపం వాళ్లనికూడా ఈదేశంలో ఉండనిద్దాం.
ప్రశ్న: 15% ఎస్.సి. రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన విభజించాలని ప్రభుత్వం చెప్పిందికదా. అది 15%కే ఎందుకు అన్వయించాలి?
జ: అదే నేను చెప్పింది. అసలు ఓపెన్ కాంపిటీషన్ వద్దు. ఏకులానికాకులం జనాభాను లెక్కగట్టి కులానికింత శాతం చొప్పున 100% ఉద్యోగాలను విభజిస్తే కింది కులాలకి మేలు జరుగుతుంది. ఓపెన్ అనేది యూజ్‌లెస్ థింగ్.
ప్రశ్న: మరి మాదిగలతో కలిసి కాకుండా ఒక బ్రాహ్మణితో కలిసి ఊరూవాడ రాయటాన్ని దళితుల్లోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు?
జ: మాదిగల్తో నేను కలిసి రాయాల్సిన అవసరం లేదు. అగ్రకులాలను కుంటున్నట్లు మాల మాదిగలేం విడిపోలేదు. అభిప్రాయ బేధాల్లోవున్నారంతే. అభిప్రాయ బేధానికి విడిపోవటానికీ చాలా తేడా ఉంది. మాల మాదిగలు ఒకే కుదుట్లోంచి పుట్టిన రెండు బెట్లలాంటి వాళ్లు. ఇద్దరూ అన్నాదమ్ముల్లాంటి వాళ్లు. విడిపోరు. ఇద్దరిదీ ధ్యేయం ఒకటే కుల నిర్మూలన. ఉదాహరణకి మాదిగ హక్కుల దండోరా రిజర్వేషన్ విభజన తన ప్రత్యేక సమస్యగా పోరాడుతూనే మళ్లీ కుల నిర్మూలన కోసం పోరాడుతుంది. అంతేగాని ఇది విడిపోవటం కాదు. కులనిర్మూలన ఉద్యమంలో భాగంగా అంబేడ్కర్ సంకర పడమన్నడు. ఊరూ వాడని సంకర కవిత అన్నాం. అంటే రక్త సమ్మిశ్రితం వల్లనే కులనిర్మూలన జరిగిద్ది. నాతోటి దళితుడితో నేను కలిసి రాస్తే తనేం చెబుతాడు. నేను చెప్పేదే చెపుతాడు. కానీ అగ్రకుల కవేం చెపుతాడు తను రిపర్ట్ అవుతాడు. నేను వాళ్లని వాడలోకి లాగుతున్నా వాడ జీవితాన్ని వాళ్లకి చూపిస్తున్నా ఇదంతా నీవల్ల, నీ కుట్ర వల్ల జరిగిందని చెప్తున్నా అతను రిపర్ట్ అయి దళితీకరణకు సిద్దమైతండు. అంటే అగ్రకులాల వాళ్లు దళితీకరించబడటం కోసమే ఇది రాసాం. అంతే తప్ప బ్రాహ్మలు నాకేదో జందెం వేస్తారని, నన్ను ఉద్ధరిస్తారని నేను వాళ్లతో కల్సి రాయలేదు.
ప్రశ్న: మీకు కోపం ఎక్కువని, మీరు విమర్శని తట్టుకోలేరని, మీకు విమర్శకులపట్ల సదభిప్రాయం లేదని చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం?
జ: కోపం ఎక్కువంటే? మనిషికి ఇంత శాతం కోపం ఉండాలని ఏ సైన్స్ అయినా నిర్ణయిస్తుందా? కోపం, సంతోషం లాంటివన్నీ మానవ లక్షణాలు. అంతేగానీ ఎక్కువేంటి, ఏసమయంలో కోపం వొచ్చింది అనేది ముఖ్యంగా ప్రాథమికంగా నేను ధిక్కార కవిని. ఉన్న అన్ని విలువల్ని ధిక్కరిస్తూ వచ్చిందే దళిత కవిత్వం. ధిక్కార అనేది లేకుండా ఎవరైనా రాసారంటే అది దళిత కవిత్వం కాదు, లలిత కవిత్వం అవుద్ది. అందుకే కోపం, ధిక్కారం దళిత కవిత్వానికి ప్రాణం అని నేను అనుకుంటున్నా. ఉదా: తెరేష్‌బాబున్నాడు, తెరేష్‌బాబు కవిత్వంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడ్తాడు. అది కోపం, అన్నమాట వ్యంగం కాదు. చాలా మందిని మనం వెక్కిరిస్తాం, వెక్కిరించటం కూడా కోపంలో భాగమే. దళిత కవిత్వంలో ప్రతి కవీ వ్యక్తం చేసేది కోపమే కాకపోతే వ్యక్తీకరణే రకరకాలుగా ఉంటుంది. ఇక విమర్శకులంటారా మనకి ఇప్పటి వరకూ వచ్చిన విమర్శ పట్లగానీ, విమర్శకుల పట్లగానీ నాకైతే నిజంగానే సదభిప్రాయం లేదు. వాళ్లకి కవిత్వం బొత్తిగా తెలియదు. నాకు నచ్చిన విమర్శకుడైవరానా ఉన్నరంటే అది ఒక లక్ష్మీనరసయ్యే.
ప్రశ్న: ఎందుకు మిమ్మల్ని పొగిడిండనా?
జ: లక్ష్మీనరసయ్య నన్ను పొగడటమేంది తిట్టాడుగా, వెలివాడని సమీక్షిస్తూ నామీద శివారెడ్డి ఇన్‌ఫ్లూయిన్స్ ఉందని చెప్పాడు. నిజానికది నాకు నచ్చని ఆరోపణ. అయినా విమర్శకుడిగా నాకు అతనంటే గౌరవం. అయినా నేనతన్ని పర్స్‌నల్‌గా కలిసి అడిగా కూడా, అయితే మిగతా విమర్శకుల్ని నేను విమర్శకులని అనుకోలేను ఫెయిల్యూర్ పోయెట్స్. ఎక్స్‌సెప్ట్ లక్ష్మీనరసయ్య మన తెలుగు విమర్శకులంతా ఫెయిల్యూర్ పోయెట్స్ వాళ్లకి కవిత్వం రాయటం చేతకాక కవిత్వ విమర్శనే ఉద్యోగంలోకి దిగారు. ఉదా: ఇటీవలి సమీక్షకులు కుర్రోళ్లు, వాళ్లకి విమర్శించు నాలెడ్జి ఉండదు, చదవరు. విమర్శకుడు అనగా విమర్శించు వోడు అని మాత్రం వాళ్లకి తెలుసు అంతే, పుస్తకాల్లో వాళ్లకి ప్లస్ పాయింట్స్ కనపడవు, అన్నీ నెగెటివ్ పాయింట్సే కనపడతాయి. కవికి సామాజిక నిబద్ధత ఎంత అవసరమో విమర్శకుడికీ అంతే అవసరం. అలాగే కవి పఠనం ఎంత అవసరమో విమర్శకుడికి అంతకు రెట్టింపు పఠనం అవసరం.
ప్రశ్న: దళిత కవిత్వం భూసమస్యని పట్టించుకోలేదని…
జ: దళిత ఉద్యమమే భూమి సమస్యతో ముడిపడి ఉంది, దళితులకి భూమి అంటే కేవలం కొలతల కందే నేలమాత్రమే కాదని, భూమిలో ముడిపడివున్న అనేక కోణాల్ని కూడా దళిత కవులు ప్రధానంగా తీసుకు రాస్తున్నారు. మద్దూరు దళిత స్త్రీలు పోరాడింది భూమి కోసమే, అలాగే నేను రాసిన దేవుడిమాన్యం కవితైతే నా సహ దళిత కవులు రాసిన ఎన్నో కవితలైతేనేం… భూమికీ, ఆర్ధికానికీ, కులనిర్మూలనకీ వీటన్నింటికీ అంతర్గతంగా వున్న లింక్‌ని గ్రహించి రాసిన కవితలే. సంస్కృతం మాత్రమే చదివే వేదపండితులకి దళిత కవిత్వం బోధపడటం కొంచెం కష్టం కదా!
ప్రశ్న: అంబేడ్కరిజం ఈ వ్యవస్థని మార్చేలేందంటున్నారు కదా!
జ: ఈ దేశంలో ప్రగతికిగానీ, విప్లవానికీ గానీ, అన్నింటికీ కులమే అడ్డంకి. ముందా కులాన్ని నిర్మూలిస్తే తప్ప ఇక్కడ సమానత్వం, సమసమాజం సాధ్యంకాదనే అంబేడ్కర్ ఆలోచన. ముఖ్యంగా ఇక్కడ కులనిర్మూలన జరిగితే విప్లవాన్ని వ్యాపారంగా చేసుకునే చాలామంది బజార్న పడతారు. అందుకే ఈ ప్రేలాపనలు వీళ్లకి రాజ్యం అంటే కేవలం పోలీసులే తప్ప దళితుల్ని చట్టబద్ధంగా ఉరితీసే రాజ్యం గురించి అవగాహన లేదు. అలాగే సామ్రాజ్యవాదం అంటే అమెరికా, మల్టీఛానళ్లు, రొయ్యలు తప్ప దళిత ఉద్యమాలకు కూడా అగ్రకుల నాయకత్వం ఉండాలనే మనువాద సామ్రాజ్యవాదం గురించి తెలియదా!
ప్రశ్న: దళితవాదం విప్లవ అడ్డంకేనా?
జ: ఖచ్చితంగా అడ్డంకే! రొమేంటిగ్గా సంచులు తగిలించుకు తిరిగే వాళ్లకీ, కీర్తి పతాకాలెగరేసుకోవటానికి దొడ్డి దారిగా విప్లవాన్ని వాడుకునే వాళ్లకి, దాన్నొక నోస్టాల్జియాగా ఫీలయ్యేవాళ్లకి ఈ దళితవాదం పరమ అడ్డంకే! విప్లవాన్ని ప్రజల కోసం చేసేవాళ్లు, నిజమైన పోరాట వాదులకు మాత్రం దళిత వాదం చాలా పాజిటివ్. అసలు నాకు తెలియకడుగుతాను ఈ నిజం మాట్లాడితే ఈ దేశపు అగ్రకులాల వాళ్లకి విప్లవానికి అసలు సంబంధమే లేదు, దాన్ని చేయాల్సింది దళితులే! మా విప్లవం గురించి వీళ్లకెందుకండీ… ప్రగతివాదులుగా వున్నవాళ్లు ప్రతిభవాదులై పోకూడదు కదా! మా ఉద్యమాలు ఎలా చేసుకుంటామో! ఎలా విజయవంతం అవుతాయో మాకు బాగా తెలుసు.
నాకు అర్దం కానిదల్లా ఎప్పటికి ఈ “దళితులు” అనే పదాన్ని మనం వదిలేస్తాం? దళితులనే వారికి కూడా వారి వారి కులాలున్నాయి,వారేమీ ప్రత్యేక జాతి కాదే? అగ్రకులాలనే దుష్టపదానికి పోటి గా తయారయ్యిందా ఈ పదం? అంటే ఈ కులపిచ్చి ఎప్పటికి మాసిపోదా? ఇప్పుడు దళితులలో కూడ వర్గాలు బయలుదేరుతున్నాయి. ఏంట్రా బాబు ఈ లోకం.
దళిత కవిత్వం, దళిత కామెడీ, దళిత సిన్మాలు, దళిత కొళాయిలు, దళిత షాపులు కూడా మొదలెడదామా?
ఏ ముస్లిం తన రచనను ముస్లిం సాహిత్యం అని చెప్పుకోడు.అలానే ఏ సాహిత్యానికీ కులం కంపు అంటడానికి వీలు లేదు.
దళితులు గొంతెత్తి తమ బాధలను, తమ హక్కులను గానం చేస్తున్నప్పుడు అగ్రకులాలకు అసహనం కలగడం సహజమే! ఇప్పటి వరకూ వచ్చిన సాహిత్యమంతా ప్రబందాలూ, సంక్లిష్ట సంస్కృత భూయిష్టాలు అయినప్పుడు వాళ్ళ బాధలను దళితులు చెప్పక ఎవరు చెబుతారు? మిగిలిన వాళ్ళకు వాళ్ళ బాధలు ఎలా తెలుస్తాయి?
దళితులు అన్న పదం పోవడం కాదు దళితులు అన్న వర్గం పోవాలి. అంటరానితనం, అవమానాలు పోవాలి. అవి సమాజంలో వున్నన్ని నాళ్ళూ దళితులూ వుంటారు, “దళితులు” అన్న పదమూ వుంటుంది.
–ఫ్రసాద్
http://blog.charasala.com
కులం లే ని మనిషి మన సమాజంలొ ఉండడం ఆశ్చర్యం . ముందితన్ని సన్మానించండి.
దళితులు అనే పదం మరాఠి భాషనుండి వచ్చింది. దానికి అణిచివేయబడిన వాళ్ళు అనే అర్ధం వుంది. దళితులు అంటే ఒక మతంగాదు, ఒక కులం కాదు. తరతరాలుగా సామాజిక అణిచివేత, శ్రమదోపిడికి గురయ్యిన శ్రమజీవులు. మనం కులం, మతం, వర్గం లేని సమాజాన్ని ఆశించడం మంచిదే, దళిత ఉద్యమం మరియు దళిత పాంధర్స్ కాలంనుండి ( 1970s) బలపడిన దళిత సాహిత్యం దళితుల దయనీయమైన జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిని బాగా అధ్యయనం చేయవలసిన అవసరమున్నది. ప్రజాసాహిత్యంలో ఎన్నో స్రవంతులు వున్నాయి. వాటిలో దళిత సాహిత్యం ఒకటి. అసలు దళిత సాహిత్య కులవ్యవస్థకు వ్యతిరేకంగా, కొంతమటుకు వర్గాలు లేని సమసమాజ నిర్మాణ దిశగానే సాగింది. అలాగే దీనిలో కొన్ని వైరుధ్యాలు కూడా వున్నాయి.
అకులా! నీ తెలివిని ప్రశంసించకుండా వుండలేక పోతున్నాను..నీ వేదన నిజమైనదే నయనా! కానీ ప్రస్తుతకాల మాన ప్రకారము కులము అనబడు మహాపదార్థము కొందరికి గౌర సూచకము, మరికొందరికి మహాపాతకము అయినందున, దళితులు గొంతు విప్పిన కారణంబున నీవు ఈ విధంగా వెటకారము చేయుట తగునా!!
ఈ చర్చ చాలా బాగుంది దలితుల సామూహిక అగ్రహమ మద్దూరి మాట్లలొ వునంది.మరిన్ని విషయాలు అందిస్థారని అసిస్థూ…….సైదులు.ఐనాల
నగేశ్ గారు చాలా బాగా చెప్పారు అసలు పోరాటాలు చెయవలసింది అణగారిన కులాలు
అకులస్తుడికి దళిత ఐక్యత బొత్తిగా ఇష్టం లేనట్టుంది.
అకులస్తుడెవరో అగ్రవర్ణ మనువాదిలా ఉన్నాడు.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అయ్యో పాపం
అకులస్తుడికి చూపు మందగించినట్లుంది
వాస్తవాలకు దూరంగా జీవిస్తున్నట్టున్నాడు.
అణగారిన గొంతుల
ధిక్కారస్వరాలను
వినలేకపోతున్నాడు.
ఈసారికి క్షమించేద్దాం!
నగేష్ నాకు నాకు కాలేజీలో,యూనివర్శిటిలోనూ జూనియర్,ఎప్పుడూ బక్కెట్ మీద దరువేస్తూ పాటలు పాడుతుండేవాడు.నాగార్జునా హాస్టల్ రూము గోడ మీద కనులానీరు రానీకు,కానీ పయనం కడ వరకూ అని రాసుకున్నాడు,గదికి ప్రహేళిక అని నామకరణం చేసుకున్నాడు,బొమ్మలేసే వాడు. విషాదమేంటంటే అతను కన్ను మూశాక చాల రోజులకు బహుశా నెలలకు కూడా నాకు తెలియదు. నగేష్ లో హాస్యం,మిమిక్రీ,డాన్సు,ఇంకా చాలా కోణాలున్నాయి.వాటిని ఎవరన్నా వివరంగా రాస్తే బాగుంటుంది.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
రాజేంద్ర కుమార్ గారూ
నగేష్ బాబు గారిగురించితెలిసిన మీలాంటి సన్నిహిత మిత్రులు రాస్తే బాగుంటుంది.
తన మీద మిత్రులు రాసే వ్యాసాలతో ఒక స్మృతి సంచిక తేవాలని అనుకుంటున్నాము
- ఖాజా
ఖాజా గారు, మీ అబిమానానికి, ఆహ్వానానికి థాంక్స్. నగేష్ కు నేను సన్నిహిత మిత్రుడిని కాదు. ఒకే కాలెజీ, ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాము. ఎందుకంటున్నానంటే, నేను నగేష్ కన్నా దాదాపు ఐదెళ్ళు పెద్దవాడిని, పైగా మూడేళ్ళు సీనియర్ను. చిన్నాపెద్ద అనే తేడా పక్కన పెడితే మా ఇద్దరికి సాహిత్యాభిలాష ఉందని ఇద్దరికీ తెలియదు. కాలేజీలో అసలా ప్రస్తావనే లేదు. యూనివర్శిటీలో నగేష్ కవితలు రాస్తాను అని ఒకటిరెండు సార్లు చూయించటం జరిగింది గాని అది మేం ఇద్దరం సీరియస్ గా తీసుకోలేదు. బహుశా యూనివర్శిటీలో మొదలు పెట్టిన రచనలు, బయటకొచ్చాక వెలుగు లోకి తెచ్చి ఉంటాడు. నేను ఇంగ్లీషు కవితలు, తెలుగులో వ్యాసాల మీద ఆరోజుల్లో శ్రద్ధ చూపటంవల్ల కూడా ఈవిధమైన కమ్యూనికేషను గ్యాప్ వచ్చి ఉండొచ్చు. పద్మారావు గారి తమ్ముడు ఎప్పుడన్నా నగేష్ ప్రస్తావన తెస్తుండే వాడు. పద్మారావు గారి అమ్మగారి మృతి చెందినప్పుడు చివరిసారి నగేష్ కనిపించాడు. అదే చివరి సారి.
ఈ దళిత ముండా కొడుకుల్ని నరికితె దేశం బాగు పడతది.
దలిథులకి ఆర్థిక అభివ్రుద్దిని కలిగిస్థె కులమ నిర్ములనమ అవుథుంది, ంగెష కు నివలి