-శివసాగర్
శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలున
గొడ్డలితో నరుకుతున్నాడు.
బలి తన చిరుపాదాలతో వామనున్ని
పాతాళానికి తొక్కేస్తున్నాడు.
మనువు కళ్ళల్లో సూదులు గుచ్చుకుని
నాలిక తెగ్గోసుకుని
చెవిలో సీసం పోసుకుని
శ్మశానంలో దొర్లుతున్నాడు
కాలం కసాయి కత్తి మీద నిలబడి
గర్జిస్తున్న ఛండాలుడు
ఆది శంకరుని పై నాలుగు వేట కుక్కల్ని
ఉసిగొల్పుతున్నాడు
ఓహో … !
ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చరిత్ర.
వద్దు, ఎవరు ఎవరి తలలూ నరకొద్దు.
రాముడు శంభూకుని తల నరికినా, శంభూకుడు రాముడి తల నరికినా జరిగేది తలనరకడమే! అది మనకొద్దు!
పాత్రలు అటూ ఇటూ కావాలని కోరుకోవడం లేదు శంభూకులు! సమ గౌరవం దక్కాలని మాత్రమే కోరుతున్నారు.
–ఫ్రసాద్
http://blog.charasala.com