Comments on: దూదేకుల కవిత్వం

by: rajavali
మీరు చెప్పింది 100% నిజమ …..

by: thummaladevarao
వ్యాసము చాలబగుంది.దూదిఎకెకులమ మీద అద్బుథవ్రరచనవ

by: md.anwarali basha
రహమతుల్ల గారు మీరు చెప్పిన వాక్యలు చూస్తుంతె మత మర్పిదు లకు

ప్రొస్థహము చెసినత్లు ఉన్నది దయ చెసి అల మత్లదకంది

by: rafi
కొత సంచర కావ లి

by: రహంతుల్లా
The 2011 census must be caste-based.

the BCs and OBCs who together constitute over 35% of population.

The caste-wise census began first in 1881 and ended in 1931. From 1941 it was given up.  opponents say caste-wise census will go against the goal of abolishing caste system, will go against the constitution and encourage casteism. But the constitution speaks only about the abolition of untouchability and not the caste.

If the govt. wanted to abolish caste why nothing was done during the past 61 years of “independence” to eradicate caste?

Even Dalits need subcaste census.even among Muslims, Christians and Sikhs the caste does exist.

Backward Muslims: Madigas in AP and Karnataka have been complaining of step-motherly treatment. Similar caste-wise demands of Dalits must be met. Backward Muslims have been crying for separate reservations. That means even among Muslims and Christians there is need for caste-wise enumeration.

The 2011 census operation must go for caste-wise details

by: rahamthulla
ఈ మధ్య మా అపార్ట్ మెంట్లలోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను  పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని  సాయిబులామె అప్యాయంగా కలుపుకొమె పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.

కొన్ని రోజుల క్రితం  చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం  “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు  చుట్టం” అని తేల్చింది.

అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.

by: rahamtulla
అనర్ధాలకు దారి తీస్తున్న అనైక్యత

దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటేలోటా? ఎంతమాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట  చేరతాయంటారు. ఈ మద్య “పరుపులుకుడతాం” అంటూ కవ్వాను బద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంటబడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు ‘దూదేకుల సాయిబులేనా?’ అని అడిగాను, “కాదండీ బాబూ,మేముకాపులం మాది ఏలూరు” అని జవాబిచ్చారు.

కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారే  అనిపించింది.

తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాడే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లాపని ఏమోగానీ దూదేకేపని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం వల్ల  “కులవృత్తి” సిద్దాంతం దెబ్బతిని పోయింది.

టర్కీ(తురక) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కాని ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ ‘తురకోళ్ళు ‘

అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు పేర్లుతో పిలుస్తున్నారు. “తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్” అనే సామెత ఉంది. “కాకర బీకర కాకు జాతారే?” అంటే దూబగుంటకు దూదేకును జాతరే అని ఇద్దరు దూదేకుల వాళ్ళూ సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయట పడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట పడుతున్నాయి.

మరోచోట మసీదుకో బోర్డు తగిలించి ఉంది. భూత ప్రేతాలను వెళ్ళగొడతామనీ, తాయిత్తులు కడతామనీ ఉంది. అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఈ రకం బోర్డులు చూశాను. మీ సంగతి ఏంటి బాబూ అని అడిగితే మాది సున్నీ గ్రూపు అన్నారు. తబ్లిక్ జమాఅత్,జమాఅతె ఇస్లామీ, అహ్లెహదీస్… వీటితో మాకు సంబంధం లేదు. మేము కొన్ని దర్గాలను సందర్శిస్తాము. అందులో ఉన్న మహనీయులు మా తరపున అల్లాకు సిఫారసు చేస్తారు అన్నారు. మహానుభావుల చేత సిఫారసు చేయించుకోవటం తప్పుకాదు. అల్లా దగ్గర పనులు తొందరగా జరుగుతాయి. మీరు మంచిచోట పోస్టింగ్ కావాలంటే రికమండేషన్ చేయించుకోవటం లేదా? అలాగే ఇది గూడా. అందుకే మేము జెండాలెత్తుతాము. పెద్దల పండగలు చేస్తాం అన్నారు. మతంలో బలవంతం లేదు. ఎవరిష్టం వారిది అన్నారు.

ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలాసిగ్గుపడిపోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే ఖురాను ఉర్దూలోనే అవతరించిందట. బావిలోని కప్పకు గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు.

” భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా దైవ ధర్మం వ్యాపించాలి.” అంటుండగానే, మరో సాయిబుగారు “ఫలానా వూళ్ళో మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ” అన్నారు. “ఇస్లాంలో చేరిన తరువాత అంతా ఒకే కేడర్  అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు?” అన్నాను. “రంగాహత్యానంతరం జరిగిన దౌర్జన్యకాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారుగదా? మీకు మాకు తేడా లేదా?” అన్నాడాయన.ఉర్దూ రాకపోతే సాయిబు అని అటు తురకసాయిబులు ఇటు హిందువులు కూడా నమ్మటం లేదు.గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించా. ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి ” ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికి హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ” అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లయింది నాపని.

ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటి దుస్థితి అని ఒక ముస్లిం నాయకుడిని అడిగాను”. గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్ళతో మాకెందుకండీతంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం” అన్నాడు. సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్ళలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు అని ఒక దూదేకుల శ్రీ వారిని  అభ్యర్ధించాను. “అమ్మో ఇంకా ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా? అడుగడుగనా లధాఫ్, లధాఫ్ అని ఎత్తి పొడవరూ?” అని ఎదురు బెదిరించాడు.కులము,భాషలతోటే గుర్తింపు, కలయిక వుందన్నమాట.మరి ఈ బాస రాని సాయిబుల్ని ఆదుకునేది ,కలుపుకునేది ఎవరు?

దూదేకుల సిద్దప్పకి దూదేకను రాదంటే లోటా?  ఆయనకి దూదేకటం రాకపోయినా  బ్రహ్మం గారి తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడు కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు (కంసాలీలు/విశ్వబ్రహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ భాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం “ముట్టున బుట్టిందీ కులము” అని తెలుగు తత్వాలే పాడాడు.

లింగిపెళ్ళీ మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు  పెట్టుకుని సంఘంలోకెళితే, అసలు సిసలు సాయిబు (ఉర్దూ జబర్దస్తీగా  మాట్లాడే మహారాజు) ఎదురైనప్పుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.మీరు  ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా  పోతున్నారని అసలుదాంట్లో (ఉర్దూలో) పసలేదని చప్పడిస్తుంటారు.భాషవేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖానా అంటావు. నేను అన్నం అంటాను అంటాడు.ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదైపోతాడు.

ఇటీవల ‘పింజారీ వెధవ ‘ అనేతిట్టు టీ.వీ. సీరియల్స్ లో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది.బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల “పింజారీ” అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనుకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో భాదపడుతున్న సంభాషణా రచయితలున్నారు. “ఓరీ రజక చక్రవర్తీ” అంటే అంత పెద్ద పేరు మాకెందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట.అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. “ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం” వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు.ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడ ల్లాగా వాళ్ళతో పాటూ  మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని దళితులు ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూస్తున్నారు కానీ  ఆతోకలతో పిలవచ్చా పిలవ కూడదా, పిలిస్తే ఎమవుతుందో అనే భయంతో మిన్నకుండా ఉన్నారు. ఒకనాడు అవమాన సూచికగా తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్ధార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించు కుంటుంది. అలాగే బాసరాని పింజారులు ,లద్దాఫులు క్రుంగిపోవద్దు,  నొచ్చుకోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ గొప్ప  ఆశయాలతో కృషి చేస్తే పదిమందికి వెలుగు చూపే చక్రవర్తులుగా “నూర్ భాషా”లుగా మన్నన పొందుతారు.

ఆ మధ్య  ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చెప్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని  దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.

పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, ముస్లిం పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం.

by: rahamthulla
గమనికలోని విష యాలుగమనించి  సభ్యతగా నేరుగా అంశం మీదనే ఎవరి అబిప్రాయం వారు చెబితే బాగుంటుంది.వ్యక్తిని విమర్శించటం తిరిగి అనిపించుకోవటం వల్ల అసలు సంగతి మరున పడిపోతున్నది.

by: Mr. Jacob
రహమతుల్లా దళిత గోవిందం వ్యాసం కానీ, ఇక్కడ రాసిన …(తొలగించబడినది)……మీ అభిప్రాయంగానీ రెండిట్లో హిందూత్వం పట్ల భక్తికనిపిస్తుంది. సరే భక్తి వుంటే వుంది కానీ ప్రస్తుత ఐడెంటిటీ వుద్యమాల పట్ల ద్వేషం, తీవ్ర వ్యతిరేకత వుంది. వాటిపట్ల చులకన భావం వుంది. ఇతను ముస్లింపేరు పెట్టుకున్న మనువు…జాగ్రత్త.

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ మిత్రులు

by: rahaMtullaa
దీపకాచార్యా

దూదేకుల వారికి జీవనాధారం గుర్తింపు గౌరవం  కావాలి అనేదే వ్యాస సారాంశం.మానవత్వం వద్దంటూ నీ ఏడుపు ఏమిటి బిడ్డా?

by: Deepakacharya
ఏమిటి ఈ రహమతుల్లా దుఖం. ఎవరికోసం ఈ బోధనలు.అయ్యా! మానవతావాదీ కొంచెం కళ్లు తెరిచి వివేచనతో ఆలోచించు. దూదేకుల వారికి నువ్వు బోదించె మానవతా వాదం కంటే ముందు జీవనాధారం కావాలి. వారికి గుర్తింపు గౌరవం కావాలి. ఇవ్వాన్నీ వదిలేసి బోధనలేమిటి తండ్రీ..!నీకు తోడు రఘోత్తమరావు వంత..

by: B.Ajay Prasad
రహమతుల్లాగారి వ్యాసం చాలా బాగుంది.

by: Raghothama Rao C
రెహమతుల్లా గారు,

అసలు వ్యాసం కంటే మీ వ్యాఖ్యే బావుంది. చాలా బాగా చెప్పారు.

by: rahamthulla
“ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003) ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు “మనం ముస్లిములమా?హిందువులమా?” అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు. ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం. ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.

దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది? ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు. ఓదార్చేకొద్దీ ఏడ్చే బిడ్దల్లాంటివే కష్టాలన్నారు. కణత తలగడ కాదు. కల నిజం కాదు. కుల మత రహితం కాకపోయినా వాటి ప్రసక్తి లేని లౌకిక భారతం ఓ మంచి ఆశే. మానవ మత భారతం చక్కటి అభిలాషే. కానీ అది ఎన్నటికీ నిజంకాని కల అని కులమతాల నెత్తుటి చరిత్ర నిరూపించింది. రిజర్వేషన్లు లేనిదే ఎక్కిరాలేని జాతులు, రిజర్వేషన్ల కోసమే కొనసాగింపబడుతున్న కులాల లెక్కలూ, రాజ్యాంగ బద్దం కాగా ఇక కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఎలా సాధ్యం? రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది. ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి.

by: Dr.Ismail Penukonda
“మీదేకులం? మీదేమతం?” అని నా బ్లాగులో నేను రాయాలనుకొన్న వ్యాసం ఇక నేను రాయక్కర్లేదు. మీ ఈ వ్యాసంలో అణువణువునా నా ఆలోచనల ప్రతిబింబాల్ని చూసుకొన్నాను. మీ కవితలు గుండెల్ని పిండేసాయి. ఇంత వివరంగా వ్యాసాన్ని రచించినందుకు మీకు నా కృతజ్ఞతలు!