boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

జనవరి, 2007 సంచిక

Joshua

వల్లంపాటి వెంకటసుబ్బయ్యప్రఖ్యాత సాహిత్య విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య 02 జనవరి 2007, సాయంత్రం మదనపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించిన వెంకటసుబ్బయ్య తెలుగు సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ అందించిన సేవలు అసాధారణమైనవి. పూర్తిగా చదవండి »

- ఎండ్లూరి సుధాకర్

మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది
బహిరంగవేదిక మీద నా సన్మానం మొదలయ్యింది
ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే
నిన్నటి నా గాయాలు ఉలిక్కిపడతుంటాయి
పూర్తిగా చదవండి »

- వరవరరావు

‘జీవితంలో ఇటువంటి నవల రాయగలిగితే అంతకన్నా సార్ధకత ఏముంటుంది?’ అన్నాడట అమరుడు పురుషోత్తం ఈ నవల చదవగానే. ‘అయినా అటువంటి జీవితమేదీ నాకు రాయడానికి’ అని కూడ వినమ్రంగా ఆ మాట పూర్తిచేసాడట.

‘అంటరాని వసంతం’ పుస్తకరూపంలో కూడ రావడానికికన్నా ముందు - అంటే ఏడాది క్రితమే రాయవలసిన వాణ్ణి, ‘అరుణతార’లో సీరియల్ ముగియగానే రాయవలసిన వాణ్ణి, ఏడాది పట్టింది. పూర్తిగా చదవండి »

- శివసాగర్
(’సృజన’ మార్చ్, 1974 సంచిక నుండి పునర్ముద్రణ)

ఈ మధ్య సెంట్రల్ బొంబాయి నుంచి లోక్‌సభకి జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికలు బహిష్కరించమని ప్రజలకి పిలుపు యిచ్చినవారు దళితపాంథర్లు. అది విజయవంతమైంది.

ఈ ఉప ఎన్నికలలో పోలయిన ఓట్లు నూటికి 38 మాత్రమే. 1971 ఎన్నికల్లో అక్కడ దాదాపు నూటికి 65 దాకా పోలయినాయి.

పూర్తిగా చదవండి »

-గుర్రం జాషువా

ముప్పు ఘటించి వీని గలిమిన్ గబళించి దేహమున్
బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందుకుండగా
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్
పూర్తిగా చదవండి »

-మద్దూరి నగేష్‌బాబు

రక్తమే సముద్రమైందో – లేక
సముద్రమే రక్తమై నరాల్లో వొదిగిందోగానీ
ఈ ఆటు పోట్ల నెత్తుటి చెలగాటంలో
బతుకొక తీరంలేని పడవ….
పూర్తిగా చదవండి »

- ఎండ్లూరి సుధాకర్

నల్ల రంగే కదా
నిన్ను పేరంటాలకూ
పెళ్ళిళ్ళకూ రాకుండా చేసింది
నీ నల్లని పాదాలుచూసి
తెల్లకళ్ళు వాంతులు చేసుకునేవి
వాయినాలు నీలో దు:ఖ వాయులీనాలవుతుండేవి
నీకు గుర్తుందా అమ్మా!

పూర్తిగా చదవండి »

- కత్తి పద్మారావు

నేను నల్లనిదానను
నా చెమట చినుకులతో
భూమిప్రియుడు పులకిస్తున్నాడు
నాగేటిచాళ్లలో నేను చల్లిన విత్తులు
నా పాదాల ఎరుపుతో మొలకెత్తుతున్నాయి
పూర్తిగా చదవండి »

- వరవరరావు

శ్రమ నిష్ఫలమై ఫలం భోజ్యమయిన పరాన్న భుక్కులు
సంస్కృత భాషలోనైనా మమ్ములను అస్పృశ్యులనే అన్నారు
అధికారం ముందు చేతులు కట్టుకొని
దొర అని సాబ్ అని సార్ అని పిలిచిన వాళ్ళను
తమలో తాము చాటుకు తిట్టుకోవడానికి
మమ్ములను మ్లేచ్ఛులను చేసి వాళ్ళను పోల్చారు

పూర్తిగా చదవండి »

- సతీష్ చందర్

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు
ఒకటిః మాకు
రెండుః మా వాళ్ళకు
మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు
పూర్తిగా చదవండి »

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

ప్రగతికి చిహ్నంగా గుడిసెల మీద
టీవీ యాంటెన్నాలు మొలుచుకొచ్చినట్లు
భూమిని పగలగొట్టుకుని మొలక పైకొచ్చినట్లు
జాతికి వెలుగు చూపే నాయకుడు
ప్రజల గుండెల్లోంచి పుట్టుకొస్తాడు
ఊరికో ఇందిరానగర్ వెలిసినట్లు
వాడకో విగ్రహమై మనసుల్లో నిలిచిపోతాడు
పూర్తిగా చదవండి »

-శివసాగర్

శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలున
గొడ్డలితో నరుకుతున్నాడు.
బలి తన చిరుపాదాలతో వామనున్ని
పాతాళానికి తొక్కేస్తున్నాడు.
పూర్తిగా చదవండి »

- ఎన్. వేణుగోపాల్

నాలుగువేల కోట్ల రూపాయలు సునాయాసంగా స్వాహా చేసేవాళ్ళూ, నాలుగణాల కోసం తమ ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టక తప్పనివాళ్ళూ సహజీవనం చేస్తున్న సమాజం మనది. అత్యాధునిక కంప్యూటర్లు జీవిత కోణాలన్నిటినీ స్పృశిస్తున్న చోటనే, రక్త పారిశుధ్యం గురించి వేల ఏళ్ళ కిందటి ఆదిమ భావజాలం కొనసాగుతున్న వ్యవస్థ మనది. పూర్తిగా చదవండి »

- ఖాజా

ఏ కులమని నను వివరమడిగితే
ఏమని చెప్పుదు లోకులకూ
లోకులకు పలుగాకులకూ
దుర్మార్గులకూ ఈ దుష్టులకూ- పూర్తిగా చదవండి »

-పెద్దరామస్వామి

ఘటన సామాజిక స్థితికి వ్యక్తరూపం.
అంతమాత్రమే కాదు, దాన్ని యింకా చాలా రకాలుగా చూడవచ్చు.

తీవ్రమైన సామాజిక వ్యక్తతనూ - దానికి ముందు, తర్వాత సాగిన అంతర్గత పరిణామాలనూ కలిపి చదువుకునే పద్ధతి అందరికీ తెలిసిందే. ఘటన సంకేతంగా, ఉదాహరణగానే కాక ఒక గీటురాయి కావడానికి కూడా అవకాశం ఉంటుంది.
పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మనిషి తన జీవితంలో రకరకాల భావాలకు లోనవుతాడు. వీటిలో ప్రేమ, జాలి, కోపం, దుఖం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి కాక కొన్ని సందర్భాల్లో దైవభక్తి, దివ్యానుభూతులు, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం వంటి భావనలు కూడా కలుగుతాయి. వీటికి జాతి, మత, ప్రాంతీయ పరిమితులేవీ ఉన్నట్టు కనబడవు. పూర్తిగా చదవండి »

- Next »