- రాజు
 

వాన ఊసులేని పూట
జలదరింపుల ఎండలేపూట
చిత్రకాంతి భూమిని చేరినవేళ

దయగల చూపుల అమ్మాయొకతి
ఇటువైపుగా బయలుదేరింది

జాలిగల విశ్రాంతి చూపుల అడుగులు
నావైపేనని భ్రమించాను

ఏ వేటగాడి శరాఘాతానికి గాయపడి
సాగిలబడ్డ పిల్లజింక జీవకళో.
 
సౌందర్య నిరాకరణేం లేదు
అడుగులు తడబడీ కాదు
ఆగంతుక మృత్యువు దారికాచి దెబ్బతీస్తున్నందుకే
 
సుందరభరిత దృశ్య నిర్మాణానికేం కొదవ
ఆగత్యపు కాలం అడుగడుగునా అడ్డుపడుతున్నందుకే…
 
అమ్మాయి అడుగులు
ఎటువేపైనా కానీయ్
 
ఆగమన సూర్యుడు
అరచేతుల తివాచీ పరిచి
అందమైన పూలు జల్లుతాడు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)