- ప్రశాంత్

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ డి. జయకాంతన్ నవల ‘కల్యాణి’
దేవులపల్లి కృష్ణశాస్త్రి 2వ సంపుటం
బదరిక, పల్లకీ
వై.ఎమ్.సి.ఎ. హాలు, నారాయణగూడ, హైదరాబాదు.
9 నవంబర్ 2006 సాయంత్రం 5 గంటలకు
అధ్యక్షత: ఏటుకూరి ప్రసాద్
ఆవిష్కర్త: కె. శివారెడ్డి, కవి
ఆత్మీయ వాక్యం: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రిఏటుకూరి ప్రసాద్:
భావ కవిత్వంలో పుట్టి అభ్యుదయ కవిత్వంలోకి ప్రస్థానం చేసినవారు కృష్ణశాస్త్రి. రంగు రుచి వాసనల పదును గల కవి. పద్యరచనలో తెలుగుదనాన్ని తెచ్చారు. ఆయన తాత్వికత బ్రహ్మ సమాజం నుండి అభ్యుదయాన్ని చూసినవాడు. సమాజం గురించి పట్టించుకున్నాడు. సోషలిజం గురించి తెలిసి సంప్రదాయాల నుంచే అయినా ఆహ్వానించాడు. ఇక జయకాంతన్ విషయానికి వస్తే గద్యరచనకు జ్ఞానపీఠం వచ్చిందాయనకు. పెద్దగా చదువుకున్నవాడు కాకపోయినా సమాజాన్ని చదివాడు. కమ్యూనిస్టు కార్యాలయంలో టీలు అందిస్తూ అక్కడే ఉన్న లైబ్రరీలో చదివి రచయిత అయ్యాడు. సోషలిజం స్థాపన కోసం ఆయన తన సాహిత్యాన్ని అంకితం చేశాడు.

కె. శివారెడ్డి - కృష్ణశాస్త్రి 2వ సంపుటి ఆవిష్కర్త
గత సాహిత్యం, సమీప గత సాహిత్యాన్ని పునర్ముద్రించి కొత్త తరానికి అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్లాసిక్స్ చదవటం తగ్గిపోయిన కాలంలో కనీసం వంద సంవత్సరాల క్రితం సాహిత్యం, ఉదాహరణకు గురజాడ వారి నుంచి కృష్ణశాస్త్రి రచనల్ని విశాలాంధ్రవారు ఐదు సంపుటాలుగా ప్రచురిస్తున్నారు. చాలా గొప్ప విషయం. నేను బి.ఎ.లో తెలుగు సాహిత్యం, ఇంగ్లీషు సాహిత్యం చదువుకొన్నాను. 1964లో బి.ఎ.లో నాకు తెలిసిన ఇద్దరేకవులు, ఒకరు కృష్ణశాస్త్రి, నండూరి. అప్పటికి నాకు శ్రీశ్రీ తెలియదు. కృష్ణశాస్త్రి ఆకట్టుకున్నట్టు ఎవరూ ఆకట్టుకోలేదు. ఎమ్.ఎ. అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో హైదరాబాదు వచ్చాను. బొల్లారం మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఓ 15 రోజులు ఉద్యోగం చేశాను. అక్కడే ఓ మ్యూజిక్ మాస్టారు ఒక పాట పాడాడు.
తెలుసు మాకు వెలుగేదో
తెలుసు చీకటేదో
మా చెవులకు కనులున్నాయ్
మా చేతులు చూస్తాయ్
విసిరికొడితే చీకటనీ
కసిరి తిడితే చీకటనీ
తెలుసు మాకు వెలుగేదో
తెలుసు చీకటేదో
ఈ పాట కృష్ణశాస్త్రిది. పుట్టుగుడ్డులు అడిగితే రేడియో కోసం రాసిచ్చాడనుకొంటాను. ఫ్రెంచి విప్లవ ప్రభావం, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు, కీట్స్, షెల్లీ, వర్డ్స్‌వర్త్‌ల ప్రభావం, ఉత్తేజం భావ కవిత్వంపై ఉంది. కృష్ణశాస్త్రి వల్ల ఇక్కడ దేశీయ ఉద్యమం అయింది. గురజాడ తీసుకొచ్చిన ప్రజాస్వామికత, అది బూర్జువా ప్రజాస్వామ్యమే కావచ్చు, ఆ తర్వాత కాలంలో కొనసాగలేదు. అభ్యుదయంతో ఆగిపోయింది. భావకవిత్వం గురించి సరి అయిన అంచనా వేయలేదని నా అభిప్రాయం. దేశీయం చేశారు. కొత్త భాషను, పద్యంనుండి పాటకు తీసుకొచ్చారు. వేదన, దుఃఖాగ్ని లేనివాడు కవి కావడానికి పనికిరాడన్నారు.
తెలుగునేల మీద భావ కవులు ఊహాశక్తికి గొప్ప పునాది వేశారు. విరసం సభ్యుడు మోహన్ ‘కిటికీ పిట్ట’ కవిత్వంలో కూడా కృష్ణశాస్త్రి కనిపిస్తాడు.

వాసరెడ్డి సీతాదేవి
జయకాంతన్ ‘కళ్యాణి’ నవల ఆంధ్ర దేశంలో కూడా జయకాంతన్‌లాగా శారద (నటరాజన్) గొప్ప కృషి చేశాడు. ఆయనే ఉండి ఉంటే జ్ఞానపీఠం వచ్చేదేమో. మామూలుగా చదివితే ప్రేమకథగా అనిపించినా చాలా గొప్ప నవల. మనుషుల స్వభావాల్ని, పురుషాధిక్య సమాజం స్త్రీ సొంత వ్యక్తిత్వాన్ని భరించలేదు. ఈ సంఘర్షణను అద్భుతంగా చిత్రించిన నవల ఇది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)