boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

డిసంబర్, 2006 సంచిక

తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ“స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును, ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు.”

- భండారు అచ్చమాంబ

- కొండవీటి సత్యవతి

స్త్రీల సాహిత్య చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎన్నెన్నో మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. ఇంత కాలం మట్టిలో కూరుకు పోయి ఉన్న వజ్రాల్ని సాన పెడితే వాటి ధగ ధగలముందు మిగిలినవన్నీ వెల వెలా పోవాల్సిందే. భండారు అచ్చమాంబలాంటి ప్రతిభావంతులెందరో చరిత్ర చీకటిలో మినుకు మినుకు మంటున్నారు. స్త్రీవాద చైతన్యంతో, స్త్రీల దృష్టికోణంతో మనం ఈ రోజు స్త్రీలను అంచులకు నెట్టేసిన సాహిత్య చరిత్రను తిరిగిరాయాల్సి వుంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే “ఆధునిక మహిళ స్త్రీల చరిత్రను తిరగ రాస్తుంది.” అని చెప్పిన గురజాడే తొలి కథకురాలు అచ్చమాంబకి పోటీగా నిలవడం. గురజాడ మీద అత్యంత గౌరంవంతోనే నేను తొలి తెలుగు కథా రచయిత్రి అచ్చమాంబే అని సగర్వంగా, సాధికారంగా ప్రకటిస్తున్నాను.

పూర్తిగా చదవండి »

- భండారు అచ్చమాంబ (నవంబర్ 1902)

ధనత్రయోదశి నాటి సాయంత్రమేడుగంటలవేళ నెటుచూచినను నానందోత్సవములలో బొంబాయి పట్టణము నిండియుండెను. నాడు దీపావళిదినమున నగునంత దీపోత్సవము లేకుండినను బ్రతిగృహమునందును ఆ గృహము యొక్క యాకారమును సౌందర్యమును నితరులకు జూగలిగిన దీపమాలికలు వెలుగుచునేయుండెను. ఎటువిన్నను టపాక్కాయల ఫటఫటధ్వనులు వినవచ్చుచుండెను. పూర్తిగా చదవండి »

- దేవీప్రియ

కోల్పోవడం, నిజానికి
నేను సాధన చేస్తున్న ఒక కళే
కలలు పోగొట్టుకున్నాను
కన్నీళ్ళు పోగొట్టుకున్నాను
పూర్తిగా చదవండి »

- స్కైబాబ

సర్వేంద్రియానాం
అందమైన చిన్నప్పటి కన్నుపాఠం
కన్ను బొమ్మ ఎంత ముద్దుగ గీసేటోన్నో
ఇప్పట్కి కళ్ళల్ల తిరుగుతున్నది
చిన్నతనం పెన్సిల్ మల్లమల్ల దిద్దిన నెమలుకన్ను
కన్ను అంటే సాలు అందమైన బొమ్మేమెదిలేది
పూర్తిగా చదవండి »

- సుద్దగోని సంజీవ్
 

ఏ నిశ్శబ్ద పరీవాహక లోయ ఇది
ఏ వనాలు పూసిన తృణీకరించబడ్డ పుష్పాలివి
 
రాలే మొగ్గలకు సరిహద్దులెక్కడ
బతుకు పూదోటలకు చెలియలికట్టలు లేని కాలమెక్కడ
పూర్తిగా చదవండి »

- వైదేహి శశిధర్

అతడు కంపార్ట్‌మెంట్‌లో అడుగు పెడుతూనే
రైలు అంతా కదుల్తోన్న సంగీతపు పెట్టె అవుతుంది.
ఉబ్బిన నల్లని రెప్పల క్రింద గాజు గోళీల్లా
వ్రేలాడే కళ్ళలో అనంతమైన చీకటిని దాచుకుని
తన అయిదేళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకుని
అతడు పెట్టె పెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు
పూర్తిగా చదవండి »

- రాజు
 

వాన ఊసులేని పూట
జలదరింపుల ఎండలేపూట
చిత్రకాంతి భూమిని చేరినవేళ

దయగల చూపుల అమ్మాయొకతి
ఇటువైపుగా బయలుదేరింది

పూర్తిగా చదవండి »

- అఫ్సర్

1
యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని
అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా !

పూర్తిగా చదవండి »

- సుంకోజి దేవేంద్రాచారి

“టిఫను తినేసి పోండి,'’ అంది అత్త.

“లేటయితే శవాన్ని తీసేస్తారేమో,'’ అంది ప్రియ.

“పన్నెండు గంటలకన్నారు. రెండు దాటతాదిలే,'’ మామ మధ్యలో కలగజేసుకున్నాడు.

“మీర్రారా?'’ అడిగాను.

పూర్తిగా చదవండి »

- ఎస్. జయ (30-9-06)

“నాన్నా! నాన్నా! ”

…  …

“లే నాన్నా! నీ ప్రీతిని పిలుస్తున్నాను. లే నాన్నా!”

చంద్రశేఖర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ప్రీతి తనను పిలవడమేమిటీ? కలకంటున్నానా? అనుకున్నాడు చుట్టూ పరికిస్తూ. పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

 

మన కళ్ళకు కనబడే ప్రపంచమూ, సంఘటనలే మనకు యదార్థం. మన శరీరానికి ఏ రాయో తగిలితే కలిగే బాధ వల్ల రాయి యదార్థత మరింత బాగాతెలుస్తుంది కూడా. స్పర్శ ద్వారానో, గాయంవల్లనో రాయి గురించి మనకు కలిగే అవగాహనతో రాతికి సంబంధమేమీ లేదు. చైతన్యం (కాన్షస్‌నెస్‌) ఉన్న ప్రాణులన్నిటికీ ఈ వ్యక్తిగతమైన (సబ్జెక్టివ్‌) అవగాహన ఉంటుంది. వస్తుపరమైన యథార్థత (ఆబ్జెక్టివ్‌ రియాలిటీ) అనేదానికీ, మన చైతన్యానికీ సంబంధం లేదని లెనిన్‌ అన్నాడు. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్‌ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్‌ వంటి మేధావులు కూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.

పూర్తిగా చదవండి »

- ముదిగంటి సుజాతారెడ్డి

వేమన గురించి అంతా మనకు తెలిసినట్లే అనిపిస్తుంది. వేమన మనకు చాలా దగ్గరివాడు, నిత్యపరిచితుడు అనిపిస్తాడు. కాని నిజంగా చూస్తే వేమన ఏ కాలంవాడు, ఏ ప్రాంతం వాడు, ఏ ఊరువాడు, ఏ మత సంప్రదాయం వాడు అని చెప్పడానికి సరైన చారిత్రక ఆధారాలేవీ లేవు. క్రీ.శ. 13వ శతాబ్దం నుంచి క్రీ.శ. 17వ శతాబ్దం వరకు వేమన కాలాన్ని పరిశోధకులు చెప్తుంటారు. 17వ శతాబ్దంలో కరువు కాటకాలతో అస్థిర రాజకీయాల మధ్య ఏర్పడిన నైరాశ్యపు రోజుల్లో వేమన పుట్టి నీతి వైరాగ్య పద్యాలను చెప్పాడని అంటారు. మరికొందరు వేమన కొండవీటి రెడ్డిరాజుల వంశంలో పుట్టాడని, క్రీ.శ. 15వ శతాబ్దం వాడుగా చెప్తారు. పూర్తిగా చదవండి »

- వట్టికోట ఆళ్వార్‌స్వామి

రామభూపాలరావు దొర బంకుల్లో అల్లుడు కొండలరావుతో కాలమాన పరిస్థితులను గురించి మాట్లాడుతూ కూర్చున్నాడు. పెద్ద గుమాస్తా హైదరలీ పత్రికను శ్రద్ధగా చూస్తున్నాడు. హైదరలీ ఆశ్చర్యంతో లేచి, “చూచారా దొరవారు! ఒక పిల్లకు రెండు తలలట, అదేదో ఊళ్ళో ఒక హరిజన స్త్రీకి పుట్టిందట. ఈ హరిజనులనే వాండ్లు ఏ దేశంలో ఉంటారు దొరవారు?'’ పత్రికను రామభూపాల్ రావుకు అందిస్తూ అన్నాడు.

“ఏ దేశమేందయ్యా! అగాధం మనిషివి. మాలమాదిగలకు గాంధీ ఆ పేరు పెట్టాడు,'’ కొండల్‌రావు హేళనగా నవ్వుతూ అన్నాడు.

పూర్తిగా చదవండి »

-మమత

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో వందల నేటివ్ అమెరికనుల తెగలు వున్నాయి. ఏ తెగ గురించి మొదట మీకు చెప్పాలి అని ఆలోచించాను. నాకు వెంటనే తట్టిన పేరు లెన్ని-లెనాపె (Lenni-Lenape). కొన్నేళ్ళ క్రితం నేను ఉండిన ఊరికి దగ్గరలోనే లెన్ని -లెనాపెల పౌ-వవ్ (Pow-wow - నేటివ్ అమెరికన్లు జరుపుకునే జాతర) జరుగుతోందని తెలిసింది. అప్పటికి నాకు నేటివ్ అమెరికన్ల గురించి తెలియక వెళ్ళలేదు. అలా నేటివ్ అమెరికనులను ఎంతోమందిని ఒక్క చోట చూడగలిగిన మొట్టమొదటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అందువల్ల నేటివ్ అమెరికన్లను తలచుకున్నప్పుడల్లా లెనాపెలే గుర్తుకు వస్తారు. పూర్తిగా చదవండి »

- ప్రశాంత్

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ డి. జయకాంతన్ నవల ‘కల్యాణి’
దేవులపల్లి కృష్ణశాస్త్రి 2వ సంపుటం
బదరిక, పల్లకీ
వై.ఎమ్.సి.ఎ. హాలు, నారాయణగూడ, హైదరాబాదు.
9 నవంబర్ 2006 సాయంత్రం 5 గంటలకు
పూర్తిగా చదవండి »

- ప్రశాంత్

తేదీలు: నవంబర్ 11-12, 2006 - సిద్ధిపేట
ప్రారంభ సభ
అధ్యక్షత : పప్పుల రాజిరెడ్డి, మరసం
ప్రారంభోపన్యాసం : కె. రామచంద్రమూర్తి, సంపాదకులు, ఆంధ్రజ్యోతి
పూర్తిగా చదవండి »

- Next »