- డా. ఎం. హరికిషన్
ప్రవహించీ… ప్రవహించీ
నవ్వుల నది నిదురవోతా వుంది
లాగేసే అయస్కాంత చూపులకు
మత్తు జల్లే నవ్వుల పరిమళాలకు
కాసేపు ఆటవిడుపు
టీవీలో అత్తాకోడళ్ళైనా
ప్రేమికుల్లా గుసగుసగానే వాదులాడుకొంటున్నారు.
వంటింట్లో గిన్నెలైనా
పువ్వుల్లా మృదువుగానే శబ్దిస్తున్నాయి.
నిశ్శబ్దాన్ని ధ్వంసంచేసే
రేపటి వెలుగుల కోసం
సేవకులంతా స్వచ్ఛంద మౌనవ్రతం పాటిస్తున్నారు.
బావుంది.