- తమ్మినేని యదుకుల భూషణ్
1.
దారి తప్పాను
ఊరినిండా ఉప్పులా
పేరుకుపోయిన మంచు
ఉరుముతోంది కుక్క..
2.
మండుటెండ
పలుకరింపుతో
మంచుకరిగి నీరై
ప్రవహించాక
చీకాకు ఎరగని చెట్టును
ఆకులా అతుక్కున్న
ఏకాకి పిట్ట
ఎగిరిపోయింది
3.
దిగబడ్డ మేకు
ఎగరడం అటుంచి
అడుగులో అడుగేసి
కూడా నడవలేను
బావుంది భూషణ్ గారూ.
చాలా బాగుంది భూషణ్ గారు. ముఖ్యంగా రెండవది బాగా నచ్చింది.
భూషణం గారూ బావున్నారా?
మీ కవితలు చదవడం మంచి అనుభవం.
కొండేపూడి నిర్మల