- ఏరియల్ డార్ఫ్‌మేన్

అతనెవరమ్మా ఆ ఫొటోలో
మామ తో?

అతనా బంగారూ – అతను నీ నాన్న

మరి నాన్న నన్ను చూడ్డానికి
ఎప్పుడూ
యింటికి రాడెందుకమ్మా?

యెందుకా – యెందుకంటే రాలేడు గనక

నాన్న చనిపోయాడా అమ్మా?
అందుకే యింటికి రావట్లేదా?

నాన్న బతికున్నాడని తనకు
చెపితే
నేను అబద్దం చెప్పినట్టవుతుంది
నాన్న చనిపోయాడని చెప్పినా
అబద్దమే

కాబట్టి అబద్దం కానిదేదైనా
చెప్పగలిగితే
అది ఒక్కటే

నాన్న ఎప్పటికీ యింటికి రాడు
యెందుకంటే రాలేడు గనక!

(మూలం: ఏరియల్ డార్ఫ్ మేన్ – చీలీ దేశపు కవి )

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)