boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

నవంబర్, 2006 సంచిక

కాళోజి 

- కాళోజీ

గుమ్మడిపూలు పూయగ బ్రతుకు
తంగెడి పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు            || బతకమ్మా! బ్రతుకు … || 
పూర్తిగా చదవండి »

- నగ్నముని

నవంబరు 13, మధ్యాహ్నం. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నయ్‌లో ఉన్నాను. రిమోట్‌తో స్పృశించగానే టి.వి. తెరమీద హఠాత్తుగా విస్ఫోటనంలా ప్రసారమైన వార్త. మన కాళోజీ భౌతికంగా మనను వీడి వెళిపోయారనే వార్త. ఆయన వయసెంతో తెలుసు. ఆయన అస్వస్థత గురించి తెలుసు, ఆసుపత్రిలో వున్నారని తెలుసు. త్వరలోనే యింటికి వస్తారని అనుకుంటుండగా, ఆయన మరోలా అనుకుని, యీ జీవితం తలుపులు బార్లా తీసుకుని వెళిపోయారనేది మాత్రం నమ్మలేని నిజం.

పూర్తిగా చదవండి »

- షాజహానా (8-09-2006)

కలల కుచ్చుముడివీడి
దారాలు దారాలుగా జీవితం
నాలుగ్గోడలకు రోజులను బిగించి
పట్టి పట్టి చేస్తున్న కలల కార్చోప్

పూర్తిగా చదవండి »

- డా. ఎం. హరికిషన్

ప్రవహించీ… ప్రవహించీ
నవ్వుల నది నిదురవోతా వుంది
పూర్తిగా చదవండి »

- తమ్మినేని యదుకుల భూషణ్

1.
దారి తప్పాను
ఊరినిండా ఉప్పులా
పేరుకుపోయిన మంచు
ఉరుముతోంది కుక్క..

పూర్తిగా చదవండి »

- కాళోజి

అతిథివోలె వుండి వుండి
అవని విడిచి వెళ్ళుతాను
పల్లె పట్టణంబులనక
పల్లేరై తిరిగినాను

పూర్తిగా చదవండి »

- కాళోజి

           “ఎంత బాగుందోయి పాట. కొంతసేపాగి, విని, మరిపోదామా?”

           “నాకు విందామనే వుంది కాని సమయానికక్కడ చేరకపోతే దయాదాక్షిణ్యం లేక దండన విధిస్తాడు ఆ యమధర్మరాజు తెలుసా?”

           “ఆ భయం మనకు లేనిదెప్పుడు. వైతరణి  దాటితే  యమపురి ఎంతదూరం. కొంచెం తొందరగా నడిస్తే  వేళకందలేమా  ఏమి?”

పూర్తిగా చదవండి »

- జి. వెంకటకృష్ణ

‘ముంపు బాధితులకిచ్చిన హామీలను నెరవేర్చండి,’ అని రాసుకొన్న ప్లకార్డ్ పట్టుకొని, ఆమె హఠాత్తుగా కనిపించింది.

కలెక్టరేట్‌లోకి వెళ్తుంటే గేటు ముందు ధర్నా చేస్తున్న ఆడవాళ్ళలో నిలబడి ఆమె అరుస్తున్నది.
 
ఆమెను చూస్తూ ధర్నాలు, నిరసనలూ లేని దినముంటుందా మీ గేటు ముందు, అని ఆలోచిస్తూ, సమాచారభవన్‌లోకి వెళ్ళి బైక్ స్టాండ్ వేసి, తిరిగొచ్చి ధర్నా ముందు నిలబడ్డాను.

పూర్తిగా చదవండి »

- వట్టికోట ఆళ్వార్‌స్వామి

తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది. ప్రజలు ఇండ్లలో నుండి బయటికి వచ్చి తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు. రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి ఎత్తయిన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండుగడ్డి వేశారు. బాటనబోయే ఒక ఆవు గడ్డిలో మూతి పెట్టబోయింది. తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది.

పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

( ‘ఆలోచనలు, అవగాహన’ అనే శీర్షిక తో కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు రాసిన శాస్త్రీయ వ్యాసాలు ప్రచురణ ప్రారంభిస్తున్నాం. ఈ సంచిక లో ముందుమాటా, ‘బుద్ధీ – భౌతికవాదం’ అనే మొదటి వ్యాసం ప్రచురిస్తున్నాం. )

చాలా ఏళ్ళ క్రితం “చందమామ”లో రక్షరేకు అనే ఒక కథ చదివాను. అందులో ఒక కుర్రవాడు పిరికివాడని గ్రహించిన సహవిద్యార్థులు వాణ్ణి ఎప్పుడూ కొట్టి ఏడిపిస్తూ ఉంటారు. రోజూ ఏడుస్తూ ఇంటికొచ్చే కొడుకుకు సాహసం నూరిపొయ్యటానికని వాడి తల్లి తమ వంశపు శౌర్యప్రతాపాలను గురించి గుర్తుచేసి వాడి చేతికొక తాతలనాటి రక్షరేకు కడుతుంది. దాన్ని ధరించినంతకాలమూ తననెవరూ ఓడించలేరని నమ్మిన కుర్రవాడు అకస్మాత్తుగా సాహసవంతుడైపోయి అందరినీ చితకబాదెయ్యగలుగుతాడు. పూర్తిగా చదవండి »

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పంచేంద్రియాల ద్వారా పరికిస్తాం. దానివల్ల జ్ఞానం పొందుతాం. మనం పుట్టినప్పటి నుంచీ బుద్ధి క్రమంగా వికసిస్తుంది. అనుభవాలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. ముఖ్యం అనిపించినవి పెద్దవారి నుంచి నేర్చుకుని, చిన్నవారికి నేర్పుతాం. కనీసం 50 వేల సంవత్సరాలనుంచి మనకు అలవాటయిన సామాజిక జీవితం ఈ సంప్రదాయన్ని బలపరుస్తూ వస్తోంది. దీనికి తిరుగులేదు.

పూర్తిగా చదవండి »

- జిలుకర శ్రీనివాస్

2000 లో ‘కక్క’ నవల వచ్చింది. ఆ ఏడు ఒక సహస్రాబ్దికీ ఒక శతాబ్దానికీ ముగింపు. ఈ నవల, ఆ వెయ్యేళ్ల జీవన పోరాటాల మీద ఒక తెలంగాణా తీర్పు. రానున్న శతాబ్దపు భవిష్యత్తుకు ఒక రాజకీయ కార్యక్రమం (పోలిటికల్ ప్రోగ్రామ్). మనకి రాజకీయ కార్యక్రమాల వంటి నవలలు ఉన్నాయి. కాల్పనికమైన రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయి. మొదటి రకంలో జీవితం ఉండదు. రెండో రకంలో జీవం ఉండదు. ఈ రెండూ ఉన్న దమ్మున్న నవల కక్క.

పూర్తిగా చదవండి »

Ari Sitaramayyaస్త్రీల సమస్యల పట్ల స్పందించడం ఇంకా అరుదైన మన ప్రవాస సమాజంలో, వారి పట్ల సానుభూతితో రచనలు చేసే ఆరి సీతారామయ్యది ప్రత్యేక ముద్ర. ‘ స్త్రీ పురుషులు సమానులుగా, పరస్పర గౌరవంతో బతగ్గలగటమే ప్రత్యామ్నాయం’ మనేది ఆయన శైలి.   జ్ఞాపకాలూ, సాంప్రదాయప్రీతి, తెలుగుతనం దాటి జనజీవనానికి అద్దం పట్టే సాహిత్యం రావాలి అనే సీతారామయ్య గారితో ‘ప్రజాకళ’ ఇంటర్‌వ్యూ.

పూర్తిగా చదవండి »

- గాబ్రియెల్ గార్సియా మార్కెజ్

తొలినాళ్ళలో నేను రాసిన కథల్లో బుద్ధి బులపాటం అధికం అనిపిస్తుంది. జీవితానికి పుస్తకానికి మధ్య ఎంతో ఎడం ఉండేది. తర్వాత్తర్వాత ఆ విషయం గ్రహించాను.నేను కథనం నేర్చింది మా అవ్వ దగ్గర! మహత్తర విషయాన్ని మామూలుగా చెప్పడంలో దిట్ట ఆమె.

పూర్తిగా చదవండి »

- మమత

“తెల్లవాడు మాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇచ్చిన మాట ఏదీ నిలబెట్టుకోలేదు, మా భూమిని ఆక్రమించుకుంటానన్నది తప్ప.” -మక్‌పియ లుత (Makhpyia–Luta: Red Cloud).

అమెరికాకు వచ్చిన కొత్తలో పబ్లిక్ లైబ్రరీలో ఒక పెద్దాయన నన్ను చూసి “నేను కూడా ఇండియన్నే “ అని అన్నాడు. అతని తెల్లటి ముఖంవైపు విచిత్రంగా చూశాను. అతను గట్టిగా నవ్వి “నువ్వు ఈస్ట్ ఇండియనువి, నేను వెస్ట్ ఇండియన్ని .. మీరనే రెడ్ ఇండియన్ని”. అమెరికన్ ఆదివాసుల గురించి పుస్తకాల్లో చదవడం తప్ప ఎప్పుడు ఇలా ఎదురుపడలేదు.

పూర్తిగా చదవండి »

 - ప్రశాంత్

ప్రెస్ క్లబ్, సోమాజిగూడ
29 అక్టోబర్ 2006 సాయంత్రం 6 గంటలకు
అధ్యక్షత : దాసరి శ్రీనివాసులు, కమీషనర్, మార్కెటింగ్ శాఖ
ఆవిష్కర్త : డా॥ ఎన్. గోపి
ఆత్మీయ అతిథి : శ్రీ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయాణ, కవి
అతిథి : వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్, ఏకలవ్య ఫౌండేషన్
సమీక్షకులు : సీతారాం, కవి

పూర్తిగా చదవండి »

- Next »