తెలుగు ప్రజల నుండి వినబడుతున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి
అంతర్జాతీయ గొంతునిచ్చే ప్రయత్నం మా ఈ ‘ప్రజాకళ

srisri-profile12.JPG

8 అభిప్రాయాలు

  1. శోధన 17 అక్టోబర్ 2006 , 7:08 am

    మంచి ప్రయత్నం…అభినందనలతో

    సుధాకర్

  2. నాగరాజా 24 అక్టోబర్ 2006 , 4:33 pm

    చక్కటి ప్రయత్నం. దయచేసి “ప్రజాస్వామిక విలువలు గల తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ తెలుగు ప్రజలకు అందిద్దామని మా లక్ష్యం” అనే వాక్యాన్ని నా వంటి వారికి అర్థం అయ్యేట్టు వివరించగలరు.

  3. Bhaskar 25 అక్టోబర్ 2006 , 5:10 am

    Wishing you the team all the very best…

    Bhaskar

  4. bhaskar ramaraju 27 అక్టోబర్ 2006 , 10:32 am

    Wishing you all the best.

    నా సహాయం కావాలంటే email ఇవ్వండి.

  5. ప్రజాకళ 30 అక్టోబర్ 2006 , 6:55 pm

    నాగరాజా గారూ,

    మీరు మా ప్రజాకళ వెబ్ సైటు కు వచ్చి చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ముందుగా మా కృతజ్ఞతలు. మీ లాంటి పాఠకుల ప్రోత్సాహం మాకెంతో అవసరం. మీకు ప్రతి నెలా ఉన్నత విలువలు గల సాహిత్యాన్ని అందించే ప్రయత్నం తప్పక చేస్తాము. అయితే ప్రజాస్వామిక విలువలు గల సాహిత్యం అంటే ఏమిటో వివరించమన్నారు. నిజానికి ఇది ఒక విస్తృతమైన అంశమే అయినా స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తాం. మేము, సాహిత్యం ప్రధానంగా సమాజాన్ని ప్రతిఫలించాలి అనుకుంటున్నాం. సమాజం తో సంబంధం లేకుండా సాహిత్యానికి ప్రయోజనం ఉండదు. ఉన్నా అది ఏ ఒకరిద్దరికో పరిమితమై వయక్తిక ప్రయోజనాలకు గిరి గీసుకుంటుంది. అటు వంటి సాహిత్యం తన కాలంలోని సమాజాన్నీ, ప్రజల జీవితాన్నీ ప్రతిబింబించదు, ప్రతిఫలించదు. కాని సమాజాన్ని చిత్రించే సాహిత్యం, ఆయా కాలాల్లో ప్రజల స్థితిగతులనీ, కలలనీ, కన్నీళ్ళనీ, ఆకాంక్షల్నీ, వారి జీవితాల్లోని సంఘర్షణలనీ ప్రతిఫలిస్తుంది. అయితే సాహిత్యం ఏ ఒక్కరి విలాసాలకోసమో అయితేనో, లేదా ఏ ఒక్కరి ప్రయోజనాలకో వత్తాసు పలికితేనో అది ఉత్తమ సాహిత్యం కాలేదు. విస్తృతమైన ప్రజా బాహుళ్యం లోని విభిన్న సమూహాల, ప్రాంతాల, తెగల జీవితాలనీ, వారు అనునిత్యం ఎదుర్కునే సమస్యలనీ, కష్టనష్టాలనీ సాహిత్యం ప్రతిఫలించినప్పుడే దానికి నిజమయిన ప్రయోజనం కలుగుతుందని మా నమ్మకం. అటువంటి సాహిత్యాన్ని ప్రజాస్వామిక విలువలు గల సాహిత్యం అంటున్నాం. ప్రజలు, తామున్న పరిస్థితి మారి మంచి జీవన స్థితిగతులేర్పడాలనో, లేదా ఫలానా విషయములో తాము వివక్షకు లోనవుతున్నామనో, లేదా తమ న్యాయమైన హక్కులు ఫలానా దాని వల్ల హరించుకుపోతున్నాయనో , లేదా ఫలానా దాని వల్ల తాము అనేక కష్టనష్టాలకు లోనయ్యి తమ జీవితాలు నాశనమైపోతున్నాయనో, లేదా ఫలానా ప్రాంతం వారు తాము అసమానతలకు గురవుతున్నామనో - తమ కోర్కెలనూ, తీవ్రమైన ఆక్రోశాలనీ, సాహిత్యంలో వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సాహిత్యాన్ని ప్రజాస్వామిక విలువలు గల సాహిత్యం అని మేము భావిస్తున్నాం. అయితే అటువంటి సాహిత్యం ఇవ్వాళ్ళ తెలుగు ప్రజలనుండి విస్తృతంగా వస్తోంది. కానీ దానిని అందరూ చదవడం జరగడం లేదు. అట్లాంటి సాహిత్యాన్ని వీలయినంత ఎక్కువ మంది చదవడం జరగాలి అని మా కోరిక. అది ఇట్లా ఈ వెబ్ సైటు ద్వారా జరుగుతుందని మా ఆశ. మా ఆశ ఏ మాత్రం నెరవేరినా మేమెంతో సంతోషిస్తాము.
    “పేదవాళ్ళ కేకలెప్పుడూ న్యాయమైనవి కాకపోవచ్చు – కానీ ఆ కేకలు వినడానికే నిరాకరిస్తే అసలు న్యాయమంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు.” – అనేది మా ప్రగాఢ విశ్వాసం. ఈ వెబ్ సైటు విజయవంతంగా నడవడానికి మీ లాంటి వారి సహాయ సహకారాలు ఎంతో అవసరము. తప్పక అందిస్తారు కదూ!
    మీకింకేమన్నా సందేహాలుంటే తప్పక మాకు రాయండి.

    మీ
    ప్రజాకళ

  6. Rohiniprasad 31 అక్టోబర్ 2006 , 4:59 pm

    మీ పత్రికలో తక్కిన సమకాలీన రచనలతో బాటుగా కొన్ని క్లాసిక్స్ వంటివి వేస్తే యువపాఠకులకు వాటిని పరిచయం చేసినవారవుతారు. ఆ రచనల గురించీ, రచయితల గురించీ పెద్దవారిచేత పరిచయ వాక్యాలు రాయిస్తే మరీ బావుంటుంది. ఒకసారి అచ్చయినవి మళ్ళీ స్వీకరించము అని మడిగట్టుకోకుండా ఉంటే తెలుగు పుస్తకాలు అందుబాటులోలేని ప్రవాసాంధ్రులకు ఎంతో మేలుచేసినట్టవుతుంది.

    మీ ప్రయత్నం బావుంది. తక్కిన వెబ్ పత్రికల పోకడలను గమనిస్తూ, వాటికి పోటీగా కాకుండా కాంప్లిమెంట్ చేసే పద్ధతిలో సంపూరకంగా నడిపితే బావుంటుంది.

  7. Nagaraja 10 మార్చ్ 2007 , 10:26 am

    మీ సమాధానానికి కృతజ్ఞతలు. చాలా సంతోషం. All the best.

  8. avula venkata subrahmanyam 09 ఏప్రిల్ 2007 , 5:46 am

    ఇది బాగుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)