- లెనార్డ్ పెల్టియర్

మనం ఒక్కొక్కరం
అమాయకత్వంతో మొదలవుతాం.
మనందరం
నేరస్తులవుతాం.

యీ ప్రపంచంలో
నువ్వు నువ్వయినందుకు
నేరస్తుడవుతావు.

నువ్వు నువ్వుగా ,
ఒక మూలవాసి గావడం
అదే నీ ఆదిమ నేరం.

అన్నింటికన్నా
హీనమైన ఆ నేరానికి
నువ్వెన్నడూ క్షమించబడవు.

మనం యిండియన్స్‌మి
అందరమూ నేరస్తులం.
మనలా వున్నందుకు నేరస్తులం.
పుట్టినప్పట్నుంచీ మనకు
నేర్పిన నేరభావన
మనం బాగా నేర్చుకున్నాం కూడా!

యీ నేరభావనను గర్వించమని
నా అక్క చెల్లెండ్లకూ
నా అన్న దమ్ములకూ
మనవి చేస్తున్నా!

నా యిండియన్ సోదరీ సోదరులారా!
యీ నేరం చేసినందుకు గర్వించండి!

మీ అమాయకత్వ మీ నేరం!
మీరు మీరుగా వుండడం మీ నేరం!
మీరు యిండియన్స్ కావడం మీ నేరం!
మీరు మనుషులు కావడం మీ నేరం!

మీ యీ నేరం
మిమ్మల్ని పరిశుభ్రుల్ని చేస్తుంది!

(నా జీవితం నా ప్రజల కోసం ప్రార్థన!!!)

లెనార్డ్ పెల్టియర్ అమెరిక కౄరమైన జాతి వివక్ష చట్టాలకు బలయిన నేటివ్ అమరికన్ యోధుడు – AIM (American Indian Movement) నాయకుడు. గత 30 యేండ్లుగా చెయ్యని నేరానికి మరణ శిక్ష విధించబడి జైలులో మగ్గి పోతున్న స్వాతంత్ర్య పోరాట యోధుడు – అతని జైలు రాతలు – నా జీవితమే నా సూర్య నృత్యం (My Life is My Sun Dance) లో అతని కవితలకివి స్వేచ్చానుసరణ.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)