boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

అక్టోబర్, 2006 సంచిక

తెలుగు ప్రజల నుండి వినబడుతున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి
అంతర్జాతీయ గొంతునిచ్చే ప్రయత్నం మా ఈ ‘ప్రజాకళ

srisri-profile12.JPG

- శ్రీశ్రీ

“అమ్మకి ప్రాణంమీద కొచ్చింది. వెంటనే బయల్దేరు – రామం.”
 

తమ్ముడిచ్చిన టెలిగ్రాం చదువుకున్నాడు వెంకటేశ్వర్లు. ఒక్కక్షణం మటుకు మనస్సులోని ఊహలన్నీ స్తంభించి మెదడు శూన్యమయింది. కత్తివేటుకి చర్మం తెగితే వెంటనే రక్తం రాదు. రక్తం రావడం  ప్రారంభించడంతో వరదగా ప్రవహిస్తోంది.

పూర్తిగా చదవండి »

- దేవీప్రియ

గాలికి ఎగిరి ఆడుతున్న
మబ్బుల తలపాగా చుట్టుకున్న
కొండశిఖరంకొన మీద
కాలిబొటనవేళ్ళ మీద నిలబడి
ప్రేమిస్తా నా జీవితాన్ని, నిన్ను…        

పూర్తిగా చదవండి »

- వరవరరావు

నేను హన్మకొండలో ఉండగా
ఇంటి ముందు
ముందుగా మోగే సైకిల్ గంటా
కనిపించే ముందటి పయ్యా
హ్యాండిల్‌పై ‘ట్రిగర్ పై వేళ్ళతోరా…’

పూర్తిగా చదవండి »

- జి. వెంకటకృష్ణ

అఖండమైందేమీ లేదని
స్వప్నం వొకటి కన్నాక
ఖండాలను సానబెట్టుకున్న
మనిషి కథ యిది

పూర్తిగా చదవండి »

 – కె.వి.కూర్మనాథ్

అవ్వ చెప్తే నమ్మలేదు గాని ఒకసారి నిజంగానే కలలోకొచ్చేడు చంద్రుడు. ఏడ్చి పడుకునే పిల్లలనాడించడానికి చంద్రుడు వస్తాడని, అసలు చంద్రుడి పనే అదని అవ్వ చెప్పేది. చంద్రుడు అందంగా కనిపిస్తూ హాయిగా అనిపించే వాడు. కానీ పిల్లలనాడిస్తాడనీ అతడికదే ప్రపంచమనీ అవ్వ చెప్తే ఆశ్చర్యమనిపించేది. పూర్తిగా చదవండి »

- ఎ. నాగరాజు

వివిధ సాహిత్య ప్రక్రియలతో పోలిస్తే కవిత్వానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. కవిత్వానికున్న ఈ ప్రత్యేకతల కారణంగానే మిగిలిన అన్ని సాహితీ ప్రక్రియల కన్నా ముందుగానే అది సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ప్రతిస్పందించగలుగుతుంది. సామాజిక వాస్తవికతకు అనుగుణంగా తలెత్తే వివిధ ధోరణులు, సామాజిక ఉద్యమాలకు కవిత్వం అడుగుజాడ కాగలుగుతుంది. కవిత్వం మాత్రమే నిర్వర్తించగల ఈ విశిష్ట పాత్రను వివరించడానికి సాహిత్య చరిత్రలోని వివిధ కీలక సందర్భాల నుండి ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చును.

పూర్తిగా చదవండి »

- ఎన్. వేణుగోపాల్

కొత్త సహస్రాబ్దిలో మొదటి దశాబ్దం సగం గడిచిపోయింది. అంతకుముందరి దశాబ్దంలో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటినీ విపరీతంగా ప్రభావితం చేసిన వస్తువు ప్రపంచీకరణ అని అందరికీ తెలుసు. కాగా, ఈ దశాబ్దంలో ఆ వస్తువు సాహిత్యం మీద ఎటువంటి ప్రభావాన్ని వేస్తోంది, అటు ఆ వస్తువులో గాని, ఇటు దాని ప్రభావంలో గాని ఏమైనా చెప్పుకోదగిన మార్పులు వచ్చాయా అని పరిశీలించడం సమాజ -సాహిత్య సంబంధాల అధ్యయనంలో ఒక ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశం.

పూర్తిగా చదవండి »

- హిమబిందు

కల్పన రెంటాలతనను ‘కనిపించే పదం’గా ప్రకటించుకున్న కల్పన రెంటాల, నిజానికి ‘వినిపించే బలమైన స్వరం’ కూడా. అచ్చం ఆమె కవితలలాగే… ఆమె మాట, భావాలు, వాటిని ప్రకటించే తీరు చాలా ‘ఇంటెన్సివ్’గా…నిలదీయటాకి ఏ మాత్రం భయపడని విధంగా వుంటాయి. అజంతా అవార్డు గ్రహీత అయిన కల్పన, స్త్రీ వాద కథ, సాహిత్య విమర్శలే కాకుండా పలు అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి, ఇప్పుడున్న కొద్ది మంది సాహిత్య విమర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. ఇండియా-పాకిస్తాన్ కవయిత్రుల కవితల్ని ‘ఆమె పాట’ కాలమ్ కింద అనువాదం చేశారు. స్త్రీల స్వరాలు ఏ స్థాయిలో ఉన్నా ఆలకించాలని, గొంతు దాటి రాని ఆలాపనలను సైతం పసిగట్టి వినిపించాలని తపన పడే ఆమెతో చిన్న సంభాషణ…

పూర్తిగా చదవండి »

- లెనార్డ్ పెల్టియర్

మనం ఒక్కొక్కరం
అమాయకత్వంతో మొదలవుతాం.
మనందరం
నేరస్తులవుతాం.

పూర్తిగా చదవండి »

2006 సంవత్సరానికి గాను సాహిత్యం లో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ని ప్రఖ్యాత టర్కీ నవలా రచయిత ఒర్హాన్ పాముక్‌కి ప్రదానం చేస్తూ స్వీడిష్ అకాడెమి ‘తను పుట్టి పెరిగిన నగరం విషాద ఆత్మను ఆవిష్కరించేందుకు పాముక్ విభిన్న సంస్కృతుల సంఘర్షణలకూ, సమ్మేళనాలకూ సాహిత్యంలో కొత్త చిహ్నాలు కనుక్కున్నాడు’ అంటూ ప్రశంసించింది.

పూర్తిగా చదవండి »

- అఫ్సర్

‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’

Heeralaal Moriaగత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ల ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు(కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్లిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ల క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్లీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా!

పూర్తిగా చదవండి »

వట్టికోట ఆళ్వారుస్వామి (1915 -1961) తెలంగాణ వైతాళికులలో ఒకరు, విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభై ఆరు సంవత్సరాల జీవితకాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజల మనిషి.        పూర్తిగా చదవండి »

- సాజీగోపాల్

taha_bookcover12.jpg   పాలస్తీనా కవి తాహ మహమ్మద్ అలీ అరబిక్ భాషలో నాలుగు కవిత సంకలనాలు రాసారు. ఇటీవల ఆ నాలుగు సంకలనాల్లోంచి యేరిన కవితలతో “అయితే ఏంటి?” అనే కవితా సంకలనం ఆంగ్లంలోకి అనువాదం చేసి కాపర్ కాన్యన్ ప్రెస్సు ప్రచురించింది. పాలస్తీనా ప్రజల దీనావస్ధలను, దశాబ్దాలుగా ఇజ్రాయిలీ దురాక్రణ లో జనం అగచాట్లను తాహ కొంత మృదువుగానూ , కొంత వినయ ధిక్కార స్వరంతోనూ తన కవితలలో చిత్రీకరించాడు.

పూర్తిగా చదవండి »