అమెరికా లో హక్కుల నాయకులు కన్నబిరాన్, బుర్రా రాములు సంస్మరణ
జూలై 10 తేదీన హక్కుల నాయకులు కన్నబిరాన్, బుర్రా రాములు సంస్మరణ సభను అమెరికా లోని డల్లాసు నగరం లో సామాజిక చైతన్య వేదిక, తెలంగాణ డెవల్పమెంట్ ఫోరం, యువరేడియో సంయుక్తంగా నిర్వహించాయి. యీ సభ లో ప్రముఖ పాత్రికేయులు నర్రిసెట్టి ఇన్నయ్య, కథాసాహితీ సంపాదకుడు వాసిరెడ్డి నవీన్, ఈలం తమిళుల హక్కుల సంఘం సభ్యుడు ప్రభ ప్రసంగించారు, టాన్ టెక్స్ పూర్వ అధ్యక్షుడు కన్నెగంటి చంద్ర చర్చలో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి »
జూలై 10 వ తారీకున “పౌరహక్కుల నాయకులు కన్నాభీరాన్, బుర్రా రాములు సంస్మరణ సభ” ను సామాజిక చైతన్య వేదిక, తెలంగాణ డెవలప్ మెంటు ఫోరం మరియు యువ రేడియో సంయుక్తంగా డల్లాస్ నగరంలో వాలీరాంచ్ లైబ్రరీ లో నిర్వహిస్తున్నాయి. యీ కార్యక్రమంలో “పౌరహక్కుల ఉద్యమం పై కన్నాభీరాన్ ముద్ర” వాసిరెడ్డి నవీన్, కథాసాహితి సంపాదకులు, “భారత దేశ మానవహక్కుల చరిత్ర లో కన్నాభీరాన్”-నర్రిసెట్టి ఇన్నయ్య, సీనియర్ పాత్రికేయులు, మానవహక్కుల ఉద్యమంలో బుర్రా రాములు పాత్ర-కేసీ, ఏడో సారా కథ: పరిచయం-దినేష్, “ప్రజా ఉద్యమాల పైన మిలటరీ ప్రయోగం”-సాజీ గోపాల్ మరియు చంద్ర కన్నెగంటి ప్రసంగం. పూర్తిగా చదవండి »
అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే. ఒక న్యాయమైన సమాజాన్ని కోరుకోవటం సమంజసమే. కానీ ఆచరణలో అవినీతిని ఎలా నిర్మూలిస్తాం? సత్యాగ్రహాలు, దండియాత్రలు, వినతి పత్రాలతో యీ లక్ష్యం నెరవేరుతోందా? లోక్ పాల్ బిల్లు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా? మనం ఒకసారి ఆలోచించాలి.
పూర్తిగా చదవండి »
జీవితం వొక మజిలీకి చేరుతుంది
తిరిగి తిరిగి గూటికి చేరే పిట్టలా
అతడూ కాదూ ఆమే కాదూ,ఇపుడు
అవనతమవనున్న వొకానొక మానవ దేహం
పూర్తిగా చదవండి »
ఈ ఆధునిక యుగంలో అనేక రంగాలలో స్త్రీలు పురుషులతో సమానంగా పాల్గొంటూ క్రియాశీల పాత్ర పొషిస్తున్నారు. భారత రాజ్యంగం చట్టరీత్యా సమాన హక్కులు కల్పించినా ఆచరణలో సమానత లేదని స్పష్టమౌతుంది. వేదకాలం నుండి మన భారతీయ సాహిత్యంలో స్త్రీకి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది.
పూర్తిగా చదవండి »
ఆమె ఎవరై ఉంటుందీ ? ఎక్కడో చూసినట్లనిపిస్తోంది కానీ, వివరాలేం గుర్తుకు రావడం లేదు… అరగంట నుండి నా మెదడులో ఇదొక్కటే ఆలోచన తొలుస్తోంది. నలభై రెండేళ్ళకే నాకు మతిమరుపు వచ్చేసిందాని - అదో బెంగా! గొప్ప వాళ్ళింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే - అక్కడ జరుగుతున్న వింతలూ , విశేషాలూ చూట్టం మానేసి కేటరింగ్ టీమ్ తో వచ్చిన లేడీ సర్వర్లలోని ఒకామెని చూసి , నేనింతగా ఆలోచించడం నాకే వింతగా ఉంది.
పూర్తిగా చదవండి »
- కె. బాలగోపాల్
సెజ్‌ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.
పూర్తిగా చదవండి »
వెంకటేశ్వరస్వామిని అమ్ముకుని బతికే పూజారులను అధికారులను మనం ఇవాళ చూస్తున్నాం. అయితే వెంకటేశ్వరస్వామిని నమ్ముకుని మాత్రమే బతికిన కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు.అన్నమయ్య భక్తకవి. అయితే ఆయన ఏనాడూ సమాజాన్ని విస్మరించి మాట్లాడలేదు. ఆయనది భావవాదమే . సృష్టి కర్త మీద విశ్వాసం ఉన్న కవే.
“కుమ్మరి వాడులేకే కుండ లేబుట్టేనా
నెమ్మినీవు పుట్టించక నేనే బుట్టితినా”
“అతని మూలమే జగమంతానిది”
పూర్తిగా చదవండి »
( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008) తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)
కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకు
న్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు మహమూద్ దర్వీష్.
పూర్తిగా చదవండి »
గతితార్కిక భౌతికవాదం
- ఐరా గొలోబిన్
మూడో అధ్యాయం
భౌతికవాదం సూత్రాలూ, వర్గీకరణ
ప్రాథమిక వివరణ - భౌతికవాదం (మెటీరియలిజం), భావవాదం (ఐడియలిజం)
భౌతికవాదం, భావవాదం అనే పదాలకు వేరువేరు అర్థాలు స్ఫురిస్తాయి. చాలామంది బూర్జువా సిద్ధాంతకర్తలు తెలిసో తెలియకో ఈ విషయంలో గందరగోళం సృష్టిస్తూఉంటారు. ఇటువంటివారు మెటీరియలిజం అనేది స్వార్థగుణాన్నీ, స్వప్రయోజనధోరణినీ, విచ్చలవిడి విషయవాంఛలను సూచిస్తుందనీ, భౌతికవాదులకు పాపపుణ్యాలపట్ల ఈసడింపు ఉంటుందనీ నీతిమంతమైన వైఖరితో నమ్మబలుకుతారు.
పూర్తిగా చదవండి »
ఎక్కడో ఇరుక్కొని ఉంటాము
పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల నెమలి కన్నులా
పూర్తిగా చదవండి »
సామాజిక-ఆర్దిక-రాజకీయ విశ్లేషణ – చర్చ
63 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఏమి సాధించాం?
మన స్వతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేరాయా?
షహీద్ భగత్ సింగ్ ఆలోచనలు ఏమిటి?
ప్రసంగాలు, చర్చ, పాటలు, కవితలు, ”స్వతంత్రం” తెలుగు నాటిక చదవటం
పూర్తిగా చదవండి »