మా… తుఝే సలామ్
- అల్లం నారాయణ
ఇక ఇక్కడితో స్వేచ్ఛ అంతమవుతుంది. కనీసం మరో ఏడాది దాకా. అడపాదడపా ఇంటి స్థలం కోసం కూడా తుపాకి తూటాలు స్వీకరించిన వారి స్వేచ్ఛ గురించి మాట్లాడే ఒక సందర్భం రావొచ్చు కానీ, మరో ఏడాది దాకా స్వాతంత్య్రం గురించి మాట్లాడాల్సిందేమీ లేకపోవచ్చు. పొద్దున్నే మెలకువతో ప్రారంభమయింది స్వేచ్ఛ. ‘మా తుఝే సలామ్’ అంటున్నడు రహమాన్. వందేమాతరం అని ఒత్తి పలికి విరిచి, బహుశా అది బంకింబాబు వందేమాతరం కాకపోవచ్చు.
పూర్తిగా చదవండి »
ఇంకెంత మూల్యం చెల్లిస్తాం?
- కె.బాలగోపాల్
జమ్మూలో భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని చాలా మంది విమర్శిస్తున్నారు. మంటలు మండాలని కోరుకునే వాళ్లు నిప్పుతోనే చెలగాటం ఆడుతారు, నీళ్లతో కాదు. 1953లో షేక్ అబ్దుల్లా అక్రమ బర్తరఫ్‌కు, అక్రమ అరెస్ట్‌కు దారితీసిన ఆనాటి జనసంఘ్ నినాదాన్ని ఎల్.కె. అద్వానీ ఇవ్వాళ జ్ఞాప కం చేసుకుంటున్నాడంటే అన్నీ తెలిసే ఆ పని చేస్తున్నాడు. తన చంచల స్వభావాన్ని రాజకీయ ప్రతిష్ఠ చాటున దాచి యోగ్యుడయిన పాలకుడిగా, ప్రజాతంత్రవాదిగా చలామణి అయిన జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు ఆ ఒత్తిడికి తలఒగ్గి అబ్దుల్లాను నిర్బంధించి నిప్పు రాజేసాడు!
పూర్తిగా చదవండి »
అణు ఒప్పందం గురించి రాస్తున్నవారందరూ అపోహలు తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నా రు. ప్రజలకు స్వతహాగా అపోహలు కలగడానికిది సాయిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపానమో కాదు. ఒకరు కలిగిస్తే తప్ప ఈ విషయంలో అపోహలు కలి గే అవకాశం లేదు. ఊహలయినా అపోహలయినా వ్యాఖ్యా తల అభిప్రాయాల వల్ల కలుగుతున్నవే.
పూర్తిగా చదవండి »
ప్రతివాదం జూలై 19, 2008
కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది.
పూర్తిగా చదవండి »
పార్లమెంటులో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెసు ప్రభుత్వం, జార్జ్ బుష్ తో “అణుఒప్పందం” చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పైకి న్యూక్లియర్ రియాక్టర్లకు అవసరమయ్యే యురేనియం ఇంధనం సమకూర్చుకోవటం యీ ఒప్పంద లక్ష్యమైనా, దీనివెనక ఎంతో రహస్య ఎజెండా వుంది. అంతర్జాతీయ మార్కెట్టులో యురేనియం, ప్లూటోనియం ఖరీదు చేయాలంటే, అమ్మడానికి సిద్ధంగా ఎన్నో దేశాలున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనటానికి అవకాశమున్నది. మరి అమెరికా నిబంధనలకు తలవగ్గాలిసిన అవసరమున్నదా?
పూర్తిగా చదవండి »
ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి
- అల్లం నారాయణ
‘ఈనె అడ్డగోలుగున్నడు సార్. మా బతుకులు నాశ్నం చేస్తండు. డిజిటల్ మీటర్లని పెట్టిచ్చిండు.కంపెనీల కాడ దొ… మా ఆటోవాళ్ల బత్కు లు బండలు చేసిండు సార్. ఈనె జూడు. ఎట్ల కట్టుకున్నడో బంగ్ల’ ఉరుము లేని పిడుగు. ఒక ఆటోవాలాకు అంత ఆగ్రహం ఉన్నట్టుగానీ, అది ఒక అపరిచితునితో, ఆటో లో కూచున్న కస్టమర్‌తో అంత ఉద్రేకంగా పంచుకుంటాడనిగానీ ఊహించి ఉండలేదు. ‘ద హిందూ’ దగ్గర ఎక్కా ను ఆటో. మోతీనగర్ అంటే అప్పటికే ఆరుగురు ఆటో వాలాలు నిరాకరించి ముఖంమీదే చీదరగా చూసి వెళ్లా రు. నాకు ఆటోవాలాల మీద పీకలదాకా కోపంగా ఉంది.
పూర్తిగా చదవండి »
- సిహెచ్. ఉషారాణి, హైదరాబాదు
హఠాత్త్ పరిణామాలేమీ కాదు
తలారా నూరిపోస్తున్నవే
మార్చి మార్చి
పూలపొట్లాలలో చుట్టితెచ్చిన నాన్నగుండె బరువును తరుముతూన్న నేనే
పదే పదే నా ప్రతిబింబాన్ని పదిల పర్చుకొటున్న నేనే
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
గతితార్కిక భౌతికవాదం అంటే తత్వశాస్త్రానికి శాస్త్రీయసూత్రీకరణవంటిది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం. హెగెల్ ముందుచూపుతో వ్యాఖ్యానించినట్టుగా “సత్యానికి యదార్థరూపంలో ఉనికినిచ్చేది దాని వైజ్ఞానికవ్యవస్థ ఒక్కటే. తత్వశాస్త్రాన్ని విజ్ఞానశాస్త్రం స్థాయికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నిరూపించాలి; ఇందుకు తోడ్పడే ప్రయత్నం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను…తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంలా రూపొందాలి. తత్వశాస్త్రంఅంటే కేవలం జ్ఞానాన్ని ప్రేమించడం కాదు; అది నిజంగా జ్ఞానమే”. 16
పూర్తిగా చదవండి »
- డా//దార్ల వెంకటేశ్వరరావు
1.0. ప్రస్తావన :
తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్రమహాభారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్రమహాభారతాన్నివర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి.
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం
తాత్విక వికాసంలోని ముఖ్యదశలు
పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం
తత్వశాస్త్రం అనేది ” వివిధ విషయాలను గురించిన ఆలోచనాత్మక అధ్యయనం” అన్నాడు తత్వ్తవేత్త హెగెల్; అది వివిధ విషయాల అంతర్గతస్వభావాలను విశదపరిచే ఆలోచనాత్మక పరిజ్ఞానం.1 ఈ “ఆలోచనాత్మక అధ్యయనం”లో రెండు అంశాలుంటాయి; (భావనల రూపంలో) మేధస్సు యొక్క నిర్మాణాత్మక ప్రక్రియలూ, (ప్రభావవంతంగా ఉండే) భావావేశపరమైనవీను. మేధస్సు అంతకంతకూ సమగ్రమయే తార్కికశక్తిని సంతరించుకుంటుంది; భావావేశాలు వ్యవస్థీకృతమైన విలువలకేసి దారితీస్తాయి.
పూర్తిగా చదవండి »
మనకూ ఉన్నారు రాజ్‌బీర్‌లు!
- కె.బాలగోపాల్
ఢిల్లీ పోలీసుల ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌బీర్ సింగ్‌ను పౌరుడెవరో ‘ఎన్‌కౌంటర్’ చేశాడని విని ‘చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత’ అనుకున్నాం. అయితే ఘటన పూర్వా పరాలు బయటకొచ్చే కొద్దీ అతను చేసుకున్నది ఇంకా చాలా ఉందని అర్థం అవుతున్నది. అతగాడిని చంపిన విజయ్ భర ద్వాజ్ అనే పౌరుడు వ్యాపారవేత్త అట.
పూర్తిగా చదవండి »
- వావిలాల గోపాలకృష్ణయ్య
“తేటల్ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము
ప్పేటల్ వోలె త్వదీయ కంఠమున శోభింపుల్ నిగారించు, చే
నాటన్ జీవన శోషణన్ గనని కృష్ణా గౌతమీ పెన్నలన్
గాటంపుం దమి త్రావువార మిదె కాంక్షాక్షీర మాంధ్రావనీ”
పరపాలననుండి బయటపడి ఇన్ని సంవత్సరములు గడచినందుకు ఉత్సవాలు జరుపు కుంటున్నాము. భారతీయ రాజకీయరంగంలో స్వాతంత్య్ర ప్రజ్వలన లార్డు క్లైవు ఏనాడు బెంగాలు ప్రజలను చీల్చి భాషా ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్లిం మత ప్రాతిపదికగా రాష్ట్రాలు నిర్మించాడో, ఆ నాడే ప్రజానీకం జాగరితమై, పరపాలన అంతమొందించవలెనను ఆవేశం కలిగింది.
పూర్తిగా చదవండి »
- జాన్ హైడ్ కనుమూరి
మాటలకు వేర్లొచ్చి
మనసు పొరల్లో పాదుకొని
నిటారుగా కొమ్మలువేసి
జీవనిర్జీవాక్షరాలుగా
నవ్వుతూ తుళ్ళుతూ
పూర్తిగా చదవండి »
- తుమ్మల దేవరావ్, నిర్మల్, అదిలాబాద్ జిల్లా.
బిడ్డా నాలేగ!
ఏ లోకాలకెల్తివిరా
మా కడ్లకు పట్టపగలే సుక్కలు సూపెడ్తవి
మా గుండెల్ని పారలతో నిలువెల్లా కోతవెడ్తివి
నడుమంత్రం పాణంబోతె
మా ముసలి పాణాల్ని కానెదోళ్ళు మన్నుపోసెదోళ్ళు
నా అయ్యా!
నువ్ ఏ పొద్దుల్లో పొడుస్తావని ఏడ్పుమానుకుందు
ఏ చీకటి ఎలుతురు పురుగైనవని ఎతుకుదు
ఏ దిక్కుల్లో నెలవంక అయ్యావని నోరుమూద్దు
ఏ పువ్వువై పూశావని కంట్లో ఒత్తులేసుకుని సూసుకుందు
బతికినట్లే బతికి నడుమత్రం బదులాయిస్తిని
కళ్ళుమూసి
పాణం కుతి తీరకముందే పట్నమంచమెక్కితివి
పూర్తిగా చదవండి »
- బెల్లంకొండ రవికాంత్
మైసూర్ వెన్నెల
వెన్నెల ఎక్కడైనా వెన్నెలే…..!
ఈ మైసూర్ వెన్నెలే
నీడలా వెంబడిస్తూ
అర్థంకాని భాషలో అందంగా నవ్వుతుంది
ఈ వెన్నెల పాదాల కింద నలిగిన మట్టి
పున్నాయిపూల పరిమళాలై
తనని కవిత్వీకరించమంటే
ఈ భాషాశాస్త్ర భవనపు మెట్లమీద
పదాలకోసం వెతుక్కుంటున్నాను
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
(ఒక్క అమెరికా సంయుక్త రాష్ర్టాల తత్వశాస్త్రపు చరిత్రనే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతిలో విశ్లేషించడం అవసరమనీ, తక్కిన దేశాలకది వర్తించదనీ కాదు; అటువంటి ప్రయత్నం ఇతర దేశాల విషయంలో జరగలేదు)
అణగారిన వర్గాలూ, అణచబడిన దేశాలూ ప్రాథమిక సామాజిక సత్యాలను అన్వేషించడం మానవు. స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టాలు పడినా, జరుగుతున్న సంఘటనల తెర వెనక ఏమవుతోందో గమనిస్తూ, అనవసర, ప్రత్యేక విషయాలను లక్ష్యపెట్టకుండా, లోతైన సామాన్య సత్యాలను కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వర్గాల స్వాతంత్య్ర పోరాటాలని బలపరిచి, మార్గదర్శనం చెయ్యగలిగిన తాత్వికసత్యాలు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. పాలకవర్గాల చరిత్రలో మాత్రం ఇటువంటి ఆలోచనలూ, చర్యలూ అన్నిటినీ అణిచెయ్యడం మామూలే; ఒకవేళ వాటిని ప్రస్తావించినా, వాటికి వక్రభాష్యాలూ, నిందలూ తప్పవు. ఇన్ని పరిమితులున్నప్పటికీ, ఈ ప్రయత్నాల గురించి మనకు తెలిసి నమ్మదగ్గ ఆధారాల్లో, ఆకరాల్లో అనేకచోట్ల కొన్ని వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. వీటిద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజల పోరాట చరిత్రను పునర్నిర్మించడం వీలవుతుంది.
పూర్తిగా చదవండి »